హైదరాబాద్ సనత్ నగర్ లోని శ్రీ చైతన్య కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది.కాలేజీ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా సమ్మర్ క్లాస్ నిర్వహిస్తున్నారంటూ ఎస్ఎఫ్ఐ ఆందోళన కార్యక్రమం చేపట్టింది.
ఈ నేపథ్యంలోనే కాలేజీలోకి వెళ్లేందుకు ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ప్రయత్నించారు.అయితే నిరసనకారులను కాలేజీ సిబ్బంది అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.







