తెలంగాణ కాంగ్రెస్ లో చేరికల ఉత్సాహం కనిపిస్తోంది.కర్ణాటక( Karnataka ) ఎన్నికలలో అనూహ్యంగా కాంగ్రెస్ విజయం సాధించడంతో, దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
ఇప్పటి వరకు కాంగ్రెస్ లోకి వెళ్దామా వద్దా అనే సందిగ్ధంలో ఉన్న ఇతర పార్టీలోని నాయకులు, అసంతృప్తులు ఇప్పుడు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారు .ఈ పరిణామాలన్నీ తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తున్నయట. ఇప్పటి వరకు బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బిజెపి కనిపించింది.బలమైన పార్టీగా గుర్తింపు పొందింది. బీఆర్ ఎస్, బిజెపిల( BRS , BJP ) మధ్య ప్రధాన పోటీ ఉంటుందని అంత భావించారు.అయితే ఇటీవల కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతం కావడం , ఇప్పుడు కర్ణాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా రావడం ఇవన్నీ తెలంగాణ కాంగ్రెస్ కు కలిసి వస్తున్నాయి.

తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకునే అవకాశం లేదనే అభిప్రాయంతో ఇతర పార్టీలు చేరిపోయి , అక్కడ సరైన ప్రాధాన్యం దక్కక ఇబ్బంది పడుతున్న నాయకులంతా మళ్ళీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారట.చేరికల విషయంలో బిజెపి ఈ మధ్యకాలంలో ఎక్కువగా దృష్టి సారించింది.హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ( Etela Rajender )కు చేరికల కమిటీ చైర్మన్ గాను బాధ్యతలు అప్పగించింది.ఆయన పెద్ద ఎత్తున బిజెపిలో చేరికలను ప్రోత్సహించి తన బలం నిరూపించుకోవాలని చూస్తున్నారు.
ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా గుర్తింపు పొందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని( Ponguleti Srinivas Reddy ) బిజెపిలో చేర్చుకునేందుకు ఈటెల చర్చలు జరిపారు .ఆయనతో పాటు, మాజీ మంత్రి బీఆర్ఎస్ లో కీలక నాయకుడిగా గుర్తింపు పొందిన జూపల్లి కృష్ణారావు ను బీఆర్ఎస్ సస్పెండ్ చేయడంతో ఆయన సైతం పొంగులేటి వెంటే పార్టీ మారాలని చూస్తున్నారు.

అయితే ఇప్పుడు వీరిద్దరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారట.వీరి చేరికతో తెలంగాణలో కాంగ్రెస్ మరింత బలం పుంజుకుంటుందని, వరుస వరుసగా కీలక నాయకులంతా చేరుతారని, బలమైన పార్టీగా కాంగ్రెస్ మారి అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఇప్పుడు బాగా పెరిగిపోయిందట.







