తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్( Aishwarya Rajesh ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మొదట రాంబంటు( Rambantu ) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన విషయం తెలిసిందే.చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపను ఏర్పరుచుకుంది.
తెలుగులో కాకుండా తమిళ సినిమాలలో కూడా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక హీరోయిన్ గా కౌసల్య కృష్ణమూర్తి( Kousalya krishnamurthy ) అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ తో పాటు రాజేంద్రప్రసాద్, శివ కార్తికేయ నటించిన విషయం తెలిసిందే.

మొదటి సినిమాతోనే ఊహించని విధంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది ఐశర్య రాజేష్.ఆ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ( Vijay devarakonda ) హీరోగా నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో కూడా నటించింది.కాగా సినిమా ఇండస్ట్రీలో అందం అభినయం కలగలిసిన హీరోయిన్ లలో ఐశ్వర్య రాజేష్ కూడా ఒకరు.
ఇది ఇలా ఉంటే తాజాగా ఐశ్వర్య రాజేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈమె తాజాగా పుష్ప( Pushpa movie ) సినిమా గురించి స్పందిస్తూ అందులో శ్రీవల్లి పాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.

పుష్ప సినిమాలో రష్మిక మందన నటించిన శ్రీవల్లి పాత్ర తనకు ఎంత ఎంతో బాగా సెట్ అవుతుందని ఆమె తెలిపింది.ఐశ్వర్య రాజేష్ తాజాగా నటించిన సినిమా ఫర్హాన.ఈ సినిమా తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే.
విడుదలకు ముందు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.తెలుగు సినిమాలు అన్న తెలుగు సినిమా ఇండస్ట్రీ అన్న తనకు ఎంతో ఇష్టమని, తెలుగులో హీరోయిన్లు తెల్లగా సన్నగా అందంగా ఉండాలని గ్లామర్ షో చేయాలని అలాంటివారిని హీరోయిన్లుగా తీసుకుంటారని, కానీ నాకు అది సెట్ కాదు అన్న ఆలోచనతో ఉన్న సమయంలో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది అని చెప్పుకొచ్చింది ఐశ్వర్య రాజేష్.
అందులో నా పాత్ర కూడా డీ గ్లామర్‌గా ఉంటుంది.మొదట నా పాత్ర కనెక్ట్ కావడం కష్టమని భావించాను కానీ రిలీజ్ అయ్యాక సినిమా ఆడలేదు, కానీ నా పాత్రకి విశేషంగా ఆదరణ దక్కింది.
ప్రశంసలు వచ్చాయి అని చెప్పుకొచ్చింది.అలాగే పుష్ప సినిమాలో నాకు అవకాశం వచ్చి ఉంటే కచ్చితంగా చేసే దాన్ని అని చెప్పుకొచ్చింది.
ఇందులో రష్మిక మందన్న బాగా నటించారని, కాకపోతే శ్రీవల్లి పాత్ర నాకు బాగా సెట్ అవుతుందని తన నమ్మకమని వెల్లడించింది.







