కర్ణాటకలో రిసార్ట్ పాలిటిక్స్ మొదలైయ్యాయని తెలుస్తోంది.ఈ మేరకు బెంగళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో కుమారస్వామితో బీజేపీ అగ్రనేతలు భేటీ అయ్యారని సమాచారం.
మరోవైపు ఆధిక్యంలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులతో కాంగ్రెస్ హైకమాండ్ టచ్ లో ఉంది.ఎమ్మెల్యేలు జారిపోకుండా కాంగ్రెస్ కీలక నేతలకు పార్టీ అధిష్టానం బాధ్యతలు అప్పజెప్పిందని తెలుస్తోంది.
ఇందులో భాగంగానే బీజేపీ రెబల్స్ తో పాటు స్వతంత్ర అభ్యర్థులతో కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ టచ్ లో ఉన్నారు.అందరినీ బెంగళూరుకు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.
కాగా ఎన్నికల ఫలితాల్లో ఇప్పటికే కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది.దీంతో కన్నడలోని పలు ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు సంబురాలను నిర్వహిస్తున్నారు.







