మాతల్లే.. కారుని ఎలా రివర్స్ చేసిందో చూడండి..

ఈ రోజుల్లో ఆడవాళ్ల డ్రైవింగ్‌కు( Woman Driving ) సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి.అందుకు కారణం వారు సిల్లీగా డ్రైవింగ్ చేసి ఇతరులను ఇబ్బందికి గురి చేయడమేనని చెప్పవచ్చు.

 Kanpur Woman Rams Her Car Into Parked Scooters And Bikes Details, Kanpur, Funny-TeluguStop.com

వారి డ్రైవింగ్ మీమ్స్‌కి కూడా దారి తీస్తుంది.డాడీస్ లిటిల్ ప్రిన్సెస్ రోడ్డుపై సృష్టించిన బీభత్సం అంటూ చాలామంది ఫన్నీగా ఈ వీడియోలను వైరల్ చేస్తున్నారు.

అయితే తాజాగా మరో మహిళ తన సిల్లీ డ్రైవింగ్ స్కిల్స్‌తో వైరల్‌గా మారింది.

ఈ మహిళ ప్రమాదవశాత్తు కాన్పూర్‌లో ( Kanpur ) ఆగి ఉన్న స్కూటర్లు, మోటార్‌సైకిళ్లపైకి తన కారును ఎక్కించింది.

గుర్తుతెలియని మహిళ తన కారును ( Car ) రివర్స్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా అదుపు తప్పి ఆగి ఉన్న వాహనాలను అది ఢీకొట్టింది.ఈ ఘటనలో కనీసం నాలుగు నుంచి ఆరు ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి.

ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ప్రజలు ఆ మహిళను ఎగతాళి చేశారు.ఆమె డ్రైవింగ్‌లో నైపుణ్యం తక్కువగా ఉందని కొందరు ఆమెను ఎగతాళి చేయగా, మరికొందరు ఆమె చాలా అనుభవం ఉన్న డ్రైవర్ కాదని చమత్కరించారు.

“మా తల్లే.ఇంకా నయం మనుషుల మీదకు కారణం ఎక్కించలేదు” అని ఇంకొందరు ఫన్నీగా కామెంట్లు పెట్టారు.ఆ మహిళ చివరికి తన కారును దారిలోకి తెచ్చుకోగలిగింది, అయితే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందుకు ఆమెకు 2500 రూపాయల జరిమానా విధించబడింది.ఈ విషయం ఇప్పుడు సద్దుమణిగిందని, ఆ మహిళపై తదుపరి చర్యలు తీసుకోబోమని పోలీసు అధికారులు చెప్పారు.

కాగా ఈ క్రాష్ భారతదేశంలో డ్రైవింగ్ టెస్టింగ్ పట్ల ఆందోళనలను రేకత్తించింది.డ్రైవింగ్ టెస్ట్ చాలా సులభం అని చాలా మంది పెదవి విరిచారు.ఇది రహదారిపై అనుభవం లేని డ్రైవర్లను డ్రైవ్ చేసేందుకు అనుమతిస్తుందని దీని వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని మరి కొందరు గుర్తు చేశారు.ఇకపోతే వీడియోలో ఉన్న మహిళ తన చర్యలకు క్షమాపణలు చెప్పింది.

తాను డ్రైవింగ్ నేర్చుకుంటున్నానని చెప్పింది.భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉంటానని కూడా చెప్పింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube