తెలుగులో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో నిఖిల్( Nikhil ) ఒకరు.ఈయన కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో వచ్చి పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
నిఖిల్ కార్తికేయ 2( Karthikeya 2 ) సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం సాధించి తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు.ఆ తర్వాత వచ్చిన 18 పేజెస్( 18 pages ) కూడా మంచి విజయం సాదించింది.
ఇలా వరుస విజయాలతో మంచి జోరు మీద ఉన్న నిఖిల్ ఇప్పుడు కొత్త సినిమా చేస్తున్నాడు.ఈ చిత్రంతో త్వరలోనే మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
నిఖిల్ పాన్ ఇండియా వ్యాప్తంగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”స్పై”.యాక్షన్ థ్రిల్లర్ గా బీ హెచ్ గ్యారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్( Aishwarya Menon ) హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక ఈ సినిమాను ఇడి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు.ఆర్యన్ రాజేష్( Aryan Rajesh ) కూడా కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల( Shri Charan Pakala ) సంగీతం అందిస్తున్నారు.మరి ఈ సినిమాతో నిఖిల్ హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాలి.ఇదిలా ఉండగా ఇప్పుడు నిఖిల్ మరో కొత్త సినిమాను ఓకే చేసినట్టు సమాచారం అందుతుంది.

ఈయన కెరీర్ లో స్వామి రారా వంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ సుధీర్ వర్మతో( director Sudhir Verma ) నిఖిల్ మరో సినిమా చేసేందుకు కమిట్ అయ్యాడని టాక్.సుధీర్ నిఖిల్ కు చెప్పాడని ఈయన ఓకే చేసాడని అంటున్నారు.ఇక ఈ సినిమాలో దివ్యంషా కౌశిక్ హీరోయిన్ గా చేయబోతుందట.ఇటీవలే రావణాసుర వంటి సినిమా చేసిన సుధీర్ ఇప్పుడు నిఖిల్ కు ఎలాంటి హిట్ ఇస్తాడో వేచి చూడాల్సిందే.







