మరో మూవీ లాక్ చేసిన నిఖిల్.. డైరెక్టర్ ఎవరంటే?
TeluguStop.com
తెలుగులో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో నిఖిల్( Nikhil ) ఒకరు.ఈయన కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో వచ్చి పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
నిఖిల్ కార్తికేయ 2( Karthikeya 2 ) సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం సాధించి తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు.
ఆ తర్వాత వచ్చిన 18 పేజెస్( 18 Pages ) కూడా మంచి విజయం సాదించింది.
ఇలా వరుస విజయాలతో మంచి జోరు మీద ఉన్న నిఖిల్ ఇప్పుడు కొత్త సినిమా చేస్తున్నాడు.
ఈ చిత్రంతో త్వరలోనే మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.నిఖిల్ పాన్ ఇండియా వ్యాప్తంగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''స్పై''.
యాక్షన్ థ్రిల్లర్ గా బీ హెచ్ గ్యారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్( Aishwarya Menon ) హీరోయిన్ గా నటిస్తుంది.
"""/" /
ఇక ఈ సినిమాను ఇడి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు.
ఆర్యన్ రాజేష్( Aryan Rajesh ) కూడా కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల( Shri Charan Pakala ) సంగీతం అందిస్తున్నారు.
మరి ఈ సినిమాతో నిఖిల్ హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాలి.
ఇదిలా ఉండగా ఇప్పుడు నిఖిల్ మరో కొత్త సినిమాను ఓకే చేసినట్టు సమాచారం అందుతుంది.
"""/" /
ఈయన కెరీర్ లో స్వామి రారా వంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ సుధీర్ వర్మతో( Director Sudhir Verma ) నిఖిల్ మరో సినిమా చేసేందుకు కమిట్ అయ్యాడని టాక్.
సుధీర్ నిఖిల్ కు చెప్పాడని ఈయన ఓకే చేసాడని అంటున్నారు.ఇక ఈ సినిమాలో దివ్యంషా కౌశిక్ హీరోయిన్ గా చేయబోతుందట.
ఇటీవలే రావణాసుర వంటి సినిమా చేసిన సుధీర్ ఇప్పుడు నిఖిల్ కు ఎలాంటి హిట్ ఇస్తాడో వేచి చూడాల్సిందే.