సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోలు తెలివిగా వ్యవహరిస్తే కళ్లు చెదిరే స్థాయిలో సంపాదించే అవకాశం ఉంటుంది.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( NTR ) ప్రస్తుతం కెరీర్ పరంగా కళ్లు చెదిరే స్థాయిలో సంపాదించే దిశగా అడుగులు వేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.
అయితే ఎన్టీఆర్ తన తర్వాత సినిమాలకు సంబంధించి వేసిన మాస్టర్ ప్లాన్ సోషల్ మీడియాలో ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.
జూనియర్ ఎన్టీఆర్ తర్వాత ప్రాజెక్ట్ లు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా తను హీరోగా తెరకెక్కే ప్రతి సినిమాలో లాభాల్లో వాటా తీసుకునే విధంగా తారక్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.ఎన్టీఆర్31వ సినిమాగా వార్2 సినిమా( War 3 ) తెరకెక్కుతుండగా ఈ సినిమాకు తారక్ పారితోషికం 35 కోట్ల రూపాయలు మాత్రమే కావడం గమనార్హం.అయితే సినిమా బిజినెస్ లో కొంత మొత్తాన్ని తారక్ వాటాగా తీసుకుంటారని తెలుస్తోంది.

ఎన్టీఆర్30, ఎన్టీఆర్32 సినిమాలకు సంబంధించి ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణ భాగస్వామిగా ఉండగా ఈ సినిమాలకు సైతం తారక్ రెమ్యునరేషన్( NTR Remuneration ) తీసుకోవడం లేదని లాభాల్లో వాటా తీసుకుంటున్నారని తెలుస్తోంది.యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలకు హిట్ టాక్ వస్తే మాత్రం ఆయనకు వందల కోట్ల రూపాయల లాభాలు వచ్చే ఛాన్స్ అయితే ఉందని సమాచారం.ఎన్టీఆర్ ప్లాన్ మామూలుగా లేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ ప్రతి ప్రాజెక్ట్ ను పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ప్రకటిస్తుండగా ఈ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.ఎన్టీఆర్ కెరీర్ పరంగా ఎంతో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటుండగా ఆయనను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.జూనియర్ ఎన్టీఆర్ పారితోషికం 70 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.
ఈ సినిమాలు విడుదలైన తర్వాత తారక్ తన పారితోషికాన్ని మరింత పెంచుతారని బోగట్టా.







