ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాకు ( East Godavari )ప్రత్యేక గుర్తింపు ఉంది.ఎందుకంటే మర్యాదలకు తూర్పుగోదావరి జిల్లా పుట్టినిల్లుగా గుర్తింపు పొందింది.
అటువంటి జిల్లాలో ఇటీవలే తాజాగా హత్య జరిగి జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.ప్రేమించిన ప్రియుడు తనను కాదని మరో మహిళతో వివాహానికి సిద్ధపడ్డాడు.
దీంతో తనకు దక్కని ప్రియుడు మరో యువతికి దక్కకూడదని కత్తిపీటతో హత్య చేసేసింది.ఈ హత్యకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
వివరాల్లోకెళితే.తూర్పుగోదావరి జిల్లాలోని గోకవరం మండలం తిరుమలాయపాలెం కు చెందిన 25 ఏళ్ల నాగశేషు తాపీ పని చేసుకుని జీవనం సాగిస్తున్నాడు.ఇతనికి అల్లురి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం చెలకవీధికి చెందిన డిబెరా కు మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది.వీరి ప్రేమాయణం ఆరు సంవత్సరాలు కొనసాగింది.
ప్రాణంగా ప్రేమించిన డిబేరా.నాగశేషు కు( Nagaseshu ) అవసరాల కోసం పలు దాఫలుగా మొత్తం రూ.2 లక్షల డబ్బులు, ఒక బంగారు గొలుసు ఇచ్చింది.

ఒకపక్క ప్రేమాయణం కొనసాగిస్తూ. డిబేరా కు తెలియకుండా సంవత్సరం కిందట నాగశేషు మరో మహిళను వివాహం చేసుకున్నాడు.ఆ విషయం డిబేరాకు తెలియకుండా దాచి పెట్టాడు.
ఈమధ్య నాగశేషు వివాహం గురించి డిబేరాకు తెలియడంతో ఎందుకు ఇలా చేశావని నిలదీసింది.తాను ఇచ్చిన గోల్డ్ చైన్ తో పాటు డబ్బులు కూడా తిరిగి ఇవ్వాలని గట్టిగా వాదించింది.
కానీ నాగ శేషు లో తప్పు చేశాననే పచ్చతాపం కనపడకపోవడం, తాను ఇచ్చిన సొమ్ము వెనుకకు తిరిగి ఇవ్వకపోవడంతో నాగశేషు పై డిబేరా పగ పెంచుకొని హత్య చేయాలని నిర్ణయించుకుంది.

డిబేరా తన స్నేహితుడు శివన్నారాయణ( Shiva narayana ) కు జరిగిన విషయాన్ని చెప్పి సాయం చేయమని కోరింది.తర్వాత ఇద్దరూ బైక్ పై బుధవారం రాత్రి 1:30 గంటలకు నాగశేషు ఇంటికి వెళ్లారు.నాగశేషు డాబాపై పడుకున్నాడు.
అతనిని లేపి గొడవ పెట్టుకుంది.గొడవ కాస్త ముదరడంతో డిబేరా కత్తిపీట తీసుకుని నాగశేషు పై ఒక్క వేటు వేసింది.
నాగశేషు తల్లి గంగా అడ్డుకునే ప్రయత్నం చేయగా శివన్నారాయణ పక్కనే ఉన్న కర్రతో ఆమెను బలంగా కొట్టాడు.చుట్టుపక్కల వారంతా నిద్రలేచి హడావిడిగా నాగశేషును 108 వాహనంలో గోకవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పరిస్థితి విషమంగా ఉండడంతో రంపచోడవరం ప్రభుత్వాస్వత్రికి తరలించగా డాక్టర్లు ఆల్రెడీ నాగశేషు చనిపోయాడని తెలిపారు.తల్లి గంగా ఇచ్చిన ఫిర్యాదు పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.







