బెల్లంకొండ నిజంగా బంగారు కొండేనా.. రిజల్ట్ తో సంబంధం లేకుండా అంత లాభమా?

బెల్లంకొండ శ్రీనివాస్( Bellamkonda Srinivas ) తెలుగులో ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించినా ఈ సినిమాలలో మెజారిటీ సినిమాల ఫలితాలు ఆయనకు షాకిచ్చాయి.అల్లుడు శ్రీను, రాక్షసుడు మినహా ఈ హీరో నటించిన సినిమాలేవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

 Hero Bellamkonda Srinivas Great In That Matter Details, Bellamkonda Srinivas, Ch-TeluguStop.com

అయితే హిందీలో ఈ హీరో ఛత్రపతి సినిమాతో( Chatrapathi ) అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.అయితే హిందీలో ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూలు వస్తుండటం గమనార్హం.

ప్రముఖ బాలీవుడ్ వెబ్ సైట్లు ఈ సినిమాకు కేవలం 2 రేటింగ్ ఇవ్వడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమాను నిర్మాతలు 50 నుంచి 60 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించారు.

బాలీవుడ్ లో బెల్లంకొండ శ్రీనివాస్ కు మంచి గుర్తింపు ఉండటంతో ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు ఏకంగా 50 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం.

ఛత్రపతి రిజల్ట్ తో సంబంధం లేకుండా బెల్లంకొండ శ్రీనివాస్ తో మరో రెండు సినిమాలు తెరకెక్కించడానికి పెన్ స్టూడియోస్( Pen Studios ) సిద్ధమైందని బోగట్టా.ఛత్రపతి సినిమా హిందీలో ఏ స్థాయిలో కలెక్షన్లను సాధించినా నిర్మాతలకు లాభాలే మిగులుతాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.బెల్లంకొండ నిజంగా బంగారు కొండే అని సోషల్ మీడియా వేదికగా కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు హిందీ ఛత్రపతి చూసి పాజిటివ్ గా స్పందిస్తున్నారు.ఈ సినిమా చాలా బాగుందని అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ వెల్లడించారు.బెల్లంకొండ శ్రీనివాస్ నటన బాగుందని పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ లా ఈ సినిమా ఉందని డైరెక్టర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.ఛత్రపతి హిందీలో సక్సెస్ సాధిస్తే వినాయక్ కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ అయ్యే ఛాన్స్ అయితే ఉంది.

వినాయక్ కెరీర్ పరంగా మరింత ఎదిగి మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube