ఒక్క ఇండస్ట్రీ హిట్ అయిన కొట్టు అన్న అంటున్న ఆ స్టార్ హీరో ఫ్యాన్స్..?

టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది హీరోలు వాళ్ల కెరియర్ లో చాలా పెద్ద హిట్స్ సాధించారు అలాగే ఇండస్ట్రీ హిట్స్ కూడా కొట్టారు.అసలు తెలుగు లో ప్రస్తుతం ఉన్న హీరోల్లో సినియర్లని మినహా ఇస్తే ఉన్న స్టార్ హీరోలు ఆరుగురు మాత్రమే అందులో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీయార్, అల్లు అర్జున్ అయితే వీళ్ళందరిలో ఒకరు తప్ప మిగితా అందరూ వాళ్ల కెరియర్ లో ఒకసారైనా ఇండస్ట్రీ హిట్ కొట్టి ఉన్నారు.

 Fans Of That Star Hero Who Says Kottu Is An Industry Hit, Ntr, Junior Ntr, Simha-TeluguStop.com

అయితే ఆ ఒక్కరూ ఎవరు అనేది మనం ఒకసారి తెలుసుకుందాం… 2001 లో రిలీజ్ అయినా ఖుషి సినిమా తో ఇండస్ట్రీ హిట్ సాధించారు పవన్ కళ్యాణ్ ,2006 లో రిలీజ్ అయినా పోకిరి సినిమా తో ఇండస్ట్రీ హిట్ కొట్టారు మహేష్ బాబు 2015 ,2017 ల లో రిలీజ్ అయినా బాహుబలి సిరీస్ తో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ సాధించారు ప్రభాస్.అయితే ఈ సినిమా ల కి డైరెక్టర్ లు ఎస్ జె సూర్య, ,పూరీజగన్నాధ్,రాజమౌళి.

ఈ డైరెక్టర్ ల లో ఎస్ ఎస్ రాజమౌళి గారికి సెపరేట్ స్టైల్ ,మగధీర ,బాహుబలి ల తో రెండు ఇండస్ట్రీ హిట్ లు కొట్టిన డైరెక్టర్ గా రికార్డు ల లో ఉన్నాడు.

 Fans Of That Star Hero Who Says Kottu Is An Industry Hit, Ntr, Junior NTR, Simha-TeluguStop.com
Telugu Ntr, Rajamouli, Simhadri, Tollywood-Movie

కొంత మంది అన్నట్లు పెద్ద డైరెక్టర్ ల తో సినిమా లు తీస్తే అవి బ్లాక్ బస్టర్ లు సాధించడమే కాకుండా రికార్డు ల ను బ్రేక్ చేస్తాయి అనడం తప్పు అని ఒక హీరో మనకి చెప్పకనే చెప్పారు.ప్రస్తుత కాలం తో టాప్ డైరెక్టర్ లు అయినా రాజమౌళి ,వి వి వినాయక్ ,పూరి జగన్నాధ్ ,కొరటాల శివ,సుకుమార్,శ్రీను వైట్ల ,త్రివిక్రమ్ శ్రీనివాస్ ,బోయపాటి శీను లాంటి వారితో పని చేసినప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) కి ఒక్క ఇండస్ట్రీ హిట్ కూడా రాలేదు,ఇప్పుడు రీ రిలీజ్ అవుతున్న సింహాద్రి సినిమా( Simhadri movie ) ని ఇండస్ట్రీ హిట్ అని చెప్పుకుంటున్న అది ఇండస్ట్రీ హిట్ కాదు అనేది అందరికి తెలిసిన నిజం.రాజమౌళి గారితో 4 సినిమా లు మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 , సింహాద్రి ,యమదొంగ ,ఆర్ ఆర్ ఆర్ లాంటి సూపర్ హిట్లు వచ్చినా అవి తన స్టార్ డాం కి ఉపయోగపడ్డాయి కానీ ఇండస్ట్రీ హిట్ లు గా నిలవలేదు.

Telugu Ntr, Rajamouli, Simhadri, Tollywood-Movie

ఇప్పుడు ఉన్న పరిస్థుతుల తో ఇండస్ట్రీ హిట్ సాధించడం చాల కష్టమైన పని ,ఎందుకు అంటే భారీ బడ్జెట్ తో రామ్ చరణ్ ,జూనియర్ ఎన్టీఆర్ లాంటి సూపర్ స్టార్స్ ,ఇండియన్ లో బెస్ట్ డైరెక్టర్ గా ఉన్న రాజమౌళి( Rajamouli ) గారు తీసిన ఆర్ ఆర్ ఆర్ సినిమా నే బాహుబలి 2 రికార్డు ల ని క్రాస్ చేయలేకపోయింది.మరి జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీ హిట్ సాధించాలి అంటే బాహుబలి 2 ని క్రాస్ చేయాలి ,అది ఇప్పట్లో జరిగే పని అయితే కాదు అని కొందరి అభిప్రాయం…చూడాలి మరి ఇంకా ముందు అయిన ఎన్టీయార్ ఇండస్ట్రీ హిట్ కొడతాడా లేదా అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube