ప్రముఖ టాలీవుడ్ నటుడు, లాయర్ అయిన సీవీఎల్ నరసింహారావు( C.V.L.Narasimha Rao ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను భార్యా బాధితుల సంఘం వ్యవస్థాపకుడినని తెలిపారు.ఉమన్ పోలీస్ స్టేషన్ లో భార్య ఫిర్యాదు చేస్తే మాత్రమే తీసుకుంటారని ఆయన తెలిపారు.అత్త, ఆడపడుచు, తోడి కోడలు ఫిర్యాదు చేస్తే తీసుకోరని ఆయన కామెంట్లు చేశారు.
భార్య వల్ల ఒక అత్త ఆత్మహత్య చేసుకోవడం చూశానని సీవీఎల్ అన్నారు.
ఇలాంటి ఘటనలు ఎన్నో చూసి భార్యా బాధితుల సంఘం దిశగా అడుగులు వేయడం జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు.2014కు ముందు ఆడపిల్ల ఫిర్యాదు చేస్తే భర్త ఫ్యామిలిని పోలీస్ స్టేషన్ లో పెట్టేవారని రెండు మూడు రోజుల తర్వాత కాంప్రమైజ్ జరిగేదని ఎన్నో ఆత్మహత్యలు నేను చూశానని ఆయన పేర్కొన్నారు.ఆ తర్వాత నోటీసులు ఇవ్వాలని రూల్స్ వచ్చాయని సీవీఎల్ కామెంట్లు చేశారు.

భార్యా బాధితుల సంఘం తరపున ఎడ్యుకేట్ చేసేవాడినని మీరు చేసిన తప్పులు మగాళ్లుగా పుట్టడం, పెళ్లి చేసుకోవడం అని నేను చెబుతానని ఆయన చెప్పుకొచ్చారు.మగవాడిని కనడం తప్పని ప్రస్తుతం మంచివాడు అంటే చేతకానివాడు, చవట అని అంటున్నారని సీవీఎల్ అభిప్రాయపడ్డారు.పాపం మంచివాడా? అనే పరిస్థితి ఏర్పడిందని అని కామెంట్లు చేయడం గమనార్హం.

అమ్మాయిలను బాధ పెట్టే మగవాళ్లకు కూడా శిక్ష పడాలని ఆయన అన్నారు.సీవీఎల్ నరసింహారావు చెప్పిన విషయాలు సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అవుతున్నాయి.సీవీఎల్ చేసిన కామెంట్ల గురించి నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్( Movie Artists Association ) ఎన్నికల సమయంలో పోటీ చేస్తానని ప్రకటించిన సీవీఎల్ నరసింహారావు ఆ తర్వాత వేర్వేరు కారణాల వల్ల పోటీ నుంచి వెనక్కు తగ్గారు.సీవీఎల్ కు లాయర్ గా కూడా ప్రజల్లో మంచి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే.







