మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్ట్ అయిన ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై సీబీఐ కోర్టులో వాదనలు ముగిశాయి.ఈ క్రమంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు డైరీని సీబీఐ న్యాయస్థానానికి సమర్పించింది.
అదేవిధంగా ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరింది.ఒకవేళ ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్ ఇస్తే ఆయన సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ పేర్కొంది.
ఆధారాలు సేకరించాకే ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రమేయం ఉందని కౌంటర్ లో సీబీఐ పునరుద్ఘాటించింది.
వివేకా హత్య కుట్ర, సాక్ష్యాల ధ్వంసంలో అవినాశ్ ప్రమేయం ఉందని తెలిపింది.అనంతరం ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై ఉత్తర్వులను సీబీఐ కోర్టు ఈనెల 15కి వాయిదా వేసింది.







