బుల్లి తెరపై కమెడియన్ గా సందడి చేస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో సుడిగాలి సుదీర్ (Sudigali Sudheer)ఒకరు ఇలా సుడిగాలి సుధీర్ వరుస కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేయడమే కాకుండా బుల్లితెరపై యాంకర్ గా వ్యవహరిస్తూ మరోవైపు సినిమా అవకాశాలను అందుకున్నారు.ఈ క్రమంలోనే ఈయన వరుసగా సాఫ్ట్ వేర్ సుధీర్, త్రీ మంకీస్, గాలోడు వంటి సినిమాలలో నటించారు.
అయితే మొదటి రెండు సినిమాలు ఈయనకు మంచి సక్సెస్ అందించలేకపోయాయి.

ఇలా గాలోడు( Galodu ) సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సుధీర్ తన తదుపరి సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.అయితే ఈ సినిమాలో సుధీర్ సరసన నటించే హీరోయిన్ గురించి తాజాగా మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు.ఈ క్రమంలోనే సుదీర్ ఈ సినిమాలో హాట్ బ్యూటీతో రొమాన్స్ చేయబోతున్నారనీ తెలుస్తోంది.
సుధీర్ నాలుగవ సినిమాలో ఆయనకు జోడిగా నటించడం కోసం బ్యాచ్ లర్ అనే డబ్బింగ్ మూవీ వల్ల తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి నటి దివ్యభారతి(Divya Barathi) ఈ సినిమాలో నటించబోతున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోని మేకర్స్ ఈ విషయాన్ని అధికారక పోస్టర్ ద్వారా తెలియజేశారు.

బ్యాచిలర్ సినిమాతో పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ అందరిని ఆకట్టుకున్నటువంటి దివ్య భారతి( Divya bHarathi ) ఇలా సుధీర్ సినిమాలో కూడా చేయబోతున్నారని తెలియడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ పోస్టర్ పై సుధీర్ అభిమానులు స్పందిస్తూ సుధీర్ లడ్డులాంటి ఛాన్స్ కొట్టేశాడని అంటున్నారు.ఈ హ్యాటీ బ్యూటీ ఉంది కాబట్టి సినిమాలో అందుకు తగ్గ సీన్స్ కూడా ఉంటాయని సుదీర్ అభిమానులు భావిస్తున్నారు.ఏది ఏమైనా సుధీర్ తన నాలుగవ సినిమాని ఈ హార్ట్ బ్యూటీతో చేయడంతో లక్కీ ఛాన్స్ కొట్టేసారని తెలుస్తోంది.







