టాలీవుడ్ హీరో మన్మధుడు అక్కినేని నాగార్జున( Akkineni Nagarjuna ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.నాగార్జునకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ మన్మధుడుగానే రాణిస్తున్నారు నాగార్జున.ఐదు పదుల వయసు దాటినా కూడా 30 ఏళ్ల యువకుడి లాగే కనిపిస్తున్నారు.
వయసు పెరుగుతున్న తరగని అందం నాగార్జునకి సొంతం అని చెప్పవచ్చు.సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు.
అయితే ఈ మధ్యకాలంలో కాస్త జోరుని తగ్గించేశారు అని చెప్పవచ్చు.

చాలాకాలంగా ఆయనకు సరైన హిట్టు పడడం లేదు.గత ఏడాది బంగార్రాజు సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ప్రస్తుతం నాగార్జున సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్లు లేవు.
అయితే నాగార్జున షెడ్యూల్స్ కారణంగా కొన్ని సినిమాలను మిస్ చేసుకున్నారట.అలా మిస్ చేసుకున్న సినిమాల్లో గ్యాంబ్లర్ సినిమా( Gambler Movie ) కూడా ఒకటి.
తమిళ్ స్టార్ హీరో అజిత్, అర్జున్ సర్జా కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.డైరెక్టర్ వెంకట్ ప్రభు( Venkat Prabhu ) దర్శకత్వం వహించిన ఈ సినిమా అజిత్( Ajith ) కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది.
అయితే ఈ సినిమాలో హీరో నాగార్జున నటించాల్సి ఉండగా కొన్ని అనుకోని కారణాలవల్ల ఈ సినిమాను నాగార్జున వదులుకున్నారట.

ఇదే విషయాన్ని డైరెక్టర్ వెంకట్ ప్రభు చెప్పుకొచ్చారు.వెంకట్ ప్రభు తాజాగా దర్శకత్వం వహించిన కస్టడీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ.గ్యాంబ్లర్ సినిమాలో అర్జున్ పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం ముందుగా నాగార్జునను అనుకున్నాము.
నాగార్జునను దృష్టిలో ఉంచుకుని కథలో ఆ పాత్రను డిజైన్ చేశాము.నాగార్జునకు ఈ స్టోరీ చెప్పగా.
చాలా నచ్చిందని, కానీ అప్పటికే వేరే సినిమాలకు కాల్ షీట్స్ ఇవ్వడంతో అడ్జస్ట్ చేయలేక ఆ సినిమాకు నో చెప్పినట్టు చెప్పుకొచ్చారు వెంకట్ ప్రభు.







