పవన్ కళ్యాణ్ లైనప్ లో ఉన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ”ఉస్తాద్ భగత్ సింగ్” ( Ustaad Bhagat Singh ) .ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఎందుకంటే వీరి కాంబో అలాంటిది.డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ( Harish Shankar ) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న క్రమంలోనే ఈ కాంబోపై అంచనాలు పెరిగాయి.
గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తెరకెక్కిన తర్వాత ఈ కాంబోలో సినిమా రావడం మళ్ళీ ఇప్పుడే.అందుకే ఈ సినిమాపై ముందు నుండి అంచనాలు ఉన్నాయి.
ఇక ఈ సినిమా షూట్ స్టార్ట్ అయ్యి మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తి అయింది.ఇప్పటికే ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి హైప్ పెంచేసిన హరీష్ ఇప్పుడు క్రేజీ అప్డేట్ ఇవ్వబోతున్నాడు.
ఈ సినిమా గ్లింప్స్ గురించి ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్న నేపథ్యంలో దీని గురించి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.వారం నుండి ఈ సినిమా గ్లిమ్స్ పై అంచనాలు పెంచుతున్న టీమ్ తాజాగా ఈ గ్లిమ్స్ రిలీజ్ డేట్ అండ్ టైం ఆఫీషియల్ గా అనౌన్స్ చేసారు.ఈ టీజర్ గ్లిమ్స్ ను మే 11న సాయంత్రం 4.59 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.
దీంతో ఈ టీజర్ కోసం ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎగ్జైట్ మెంట్ గా ఉన్నారు.ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది.అలాగే శ్రీలీల ( SreeLeel ) హీరోయిన్ గా నటిస్తుండగా.దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.