నాచురల్ బ్యూటీ సాయి పల్లవి ( Saipallavi ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రేమమ్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయినటువంటి సాయి పల్లవి తెలుగులో మాత్రం ఫిదా ( Fidaa ) సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమై మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇలా ఇండస్ట్రీలో ఈమె ఏలాంటి గ్లామర్ షో కి తావు లేకుండా అలాగే సినిమాలలో ఎలాంటి లిప్ లాక్స్ సన్ని వేషాలు రొమాంటిక్ సన్నివేశాలకు తావు లేకుండా సినిమా కథల ఎంపిక విషయంలో చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ సినిమాలలో నటిస్తుంటారు.
ఇలా ఏ విషయం గురించి అయినా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకునే సాయి పల్లవిలో కూడా ఓ నెగటివ్ పాయింట్ ఉందని తెలుస్తుంది.
ఈ నెగిటివ్ పాయింట్( Negative Point ) కారణంగానే ఎంతో మంచి సినీ కెరియర్ ఉన్నప్పటికీ ఈమె చేతులారా తన కెరీర్ ను ఇబ్బందులలో పడేసుకుంటుందని తెలుస్తోంది.మరి సాయి పల్లవిలో ఉండే ఆ నెగటివ్ పాయింట్ ఏంటి అనే విషయానికి వస్తే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత హీరోయిన్ అంటే కొన్ని సన్నివేశాలలో మనం పెట్టుకున్న బౌండరీస్ దాటి నటించాల్సి ఉంటుంది.

ఇలా కొన్నిసార్లు అవసరమైతే మన హద్దులను దాటి నటించడం వల్ల కూడా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు మనగడ సాగించడానికి అవకాశం ఉంటుంది కానీ సాయి పల్లవి మాత్రం నేను ఇలాగే ఉండాలి ఇలాంటి పాత్రలలోనే నటించాలని కొన్ని నియమాలు పెట్టుకున్నారు.ఈ నియమాలు తనకు నెగిటివ్ గా మారుతున్నాయని అందుకే తనకు సినిమా అవకాశాలు పెద్దగా రాలేదని తెలుస్తోంది.

ఒకప్పుడు సినిమా హీరోయిన్లు కూడా ఇలాగే చాలా పద్ధతిగా నటించేవారు కానీ కొన్నిసార్లు వాళ్ళు హెల్తీ రొమాన్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునేవారు.అలాగే సాయి పల్లవి కూడా అప్పుడప్పుడు ఇలాంటి సన్నివేశాలలో అవసరమైతే నటిస్తేనే తనకు ఇండస్ట్రీలో హీరోయిన్ గా మనుగడ ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అయితే సాయి పల్లవి అలాంటి సన్నివేశాలలో నటించాల్సి వచ్చి తనకు అవకాశాలు రాకపోతే తాను ఇండస్ట్రీకే దూరమవుతానని తన వైద్య వృత్తిలో స్థిరపడతానంటూ ఖరాఖండిగా చెప్పిన విషయం కూడా మనకు తెలిసిందే.







