వాలంటీర్ల తొలగింపు పై ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాల వెనుక రీజన్ ఏంటి ?

అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే జగన్ ప్రభుత్వం( CM Jagan ) ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ పై( Volunteers ) దేశవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది.ప్రభుత్వ పథకాలను ప్రజలకు సులభతరంగా అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ అవినీతి లేకుండా పారదర్శకంగా పని చేయడం ప్రభుత్వ పథకాలు( Govt Schemes ) ప్రజలకు అందేలా చేయడంలో విజయవంతమైంది .

 Ap Government Release New Rules On Volunteers Details,ap Government , Ap Volunte-TeluguStop.com

అంతేకాకుండా ప్రభుత్వంతో పని చేయించుకోవాలంటే చెప్పులరిగేలా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాలన్న భావనను కూడా తొలగించి ఇంటి దగ్గరికి వచ్చి మరీ పని చేసి పెట్టే వ్యవస్థపై సామాన్య ప్రజల్లో కూడా మంచి పేరు వచ్చింది .అయితే ప్రభుత్వ ధనంతో జీతాలు ఇస్తూ పార్టీ కార్యక్రమాలలో వీరి ని ఉపయోగించుకోవడంపై కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి .

Telugu Ap, Ap Volunteers, Chandrababu, Cmjagan, Schemes-Telugu Political News

ప్రతిపక్షాలు ఈ విషయంలో ప్రభుత్వాన్ని కార్నర్ చేసి .కోర్టులకు కూడా వెళ్లాయి.కొన్ని కేసులు కోర్టులో పెండింగ్లో ఉన్నాయి.ఇప్పుడు ప్రభుత్వం సడన్గా వాలంటీర్ల తొలగింపుకు అనుసరించాల్సిన నిబంధనలపై మార్గదర్శకాలను విడుదల చేసింది ….పథకాల అమలులో అవినీతి, విధులు నిర్వహించడంలో అలసత్వం ,,దుష్ప్రవర్తన, నైతిక విలువలు పాటించకపోవడం లాంటి విషయాలలో ఆరోపణలు వస్తే వీరిని తొలగించే విధంగా ప్రభుత్వం ఆదేశాలు విడుదల చేసింది .అయితే ఈ ఆరోపణలపై వీరు సమాధానం ఇవ్వడానికి తమ తప్పులేదని నిరూపించుకోవడానికి 15 రోజులు సమయం కూడా ఇవ్వటం కొంత ఊరట.

Telugu Ap, Ap Volunteers, Chandrababu, Cmjagan, Schemes-Telugu Political News

అయితే ఉన్నట్టుండి ఇలాంటి ఆదేశాలు ఇవ్వడానికి కారణాలు ఏమిటా అని విశ్లేషిస్తే వాలంటీర్లు వ్యవస్థపై తెలుగుదేశం వేసిన కేసు పై విచారణ జూన్ నెల లో జరుగుతుంది .ఇప్పటికే వాలంటీర్ల వ్యవస్థపై ఎటువంటి మార్గదర్శకాలు పాటిస్తున్నారు అంటూ కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఉన్న దరిమిలా వచ్చే విచారణ సమయానికి తగిన సమాధానం ఇవ్వడం కోసమే ఇప్పుడు ఈ మార్గదర్శకాలు విడుదల చేసినట్లుగా సమాచారం.అంతేకాకుండా ఎన్నికల సంవత్సరం అయినందున వాలంటీర్లు పార్టీకి అనుకూలంగా పనిచేయకుండా తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేస్తే వారి ఉద్యోగాలు పోతాయి అన్న సంకేతాలను వాలంటీర్లు ఇవ్వడానికి కూడా ఇలాంటి నిబంధనలు తీసుకువచ్చారనివార్తలు వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube