ఇటీవల ఎన్టీఆర్ శతాజయంతి వేడుకలకు సూపర్ స్టార్ రజినీకాంత్( Rajinikanth ) విజయవాడ రావడం తెలిసిందే.ఆ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు విజన్ గురించి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.
దీనిలో భాగంగా హైదరాబాద్ అభివృద్ధిపై రజనీకాంత్ ప్రశంసలు వర్షం కురిపించారు.ఇటీవల హైదరాబాద్ వెళ్ళినప్పుడు.
అసలు న్యూయార్క్ లో ఉన్నామా లేకపోతే హైదరాబాదులో ఉన్నామా అనే భావన కలిగిందని.చెప్పుకొచ్చారు.
హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు ( Chandrababu Naidu )కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు.

ఈ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ లేటెస్ట్ గా స్పందించారు.హైదరాబాద్ అభివృద్ధిని చూసి సెలబ్రిటీలు సైతం మెచ్చుకుంటున్నారని చెప్పుకొచ్చారు.సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ హైదరాబాద్ ను న్యూయార్క్ నగరంతో పోల్చారని కేటీఆర్ వివరించారు.

హైదరాబాద్ నీ విశ్వ నగరంగా మార్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం( BRS party ) అన్ని రకాలుగా కృషి చేస్తుందని స్పష్టం చేశారు.బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ లో రకరకాల ప్రాజెక్టులు తీసుకురావటం మాత్రమే కాదు అంతర్జాతీయ స్థాయిలో అనేక సమావేశాలు నిర్వహించటం జరిగింది.పెద్ద పెద్ద కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి.ప్రపంచంలోనే హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా దూసుకుపోతూ ఉంది.







