మెగా అల్లు వారికి ఇప్పటివరకు ఒక స్టూడియో లేదు అన్న విషయం తెలిసిందే.ఎప్పటి నుంచో మెగా స్టూడియో ఒకటి ప్లానింగ్ లో ఉన్నా అది ఎందుకో ముందుకు రావట్లేదు.
ఈలోగా అల్లు ఫ్యామిలీ అల్లు రామలింగయ్య 99వ జయంతి సందర్భంగా అల్లు స్టూడియోస్ కి( Allu Studios ) శంకుస్థాపన జరిపారు.అల్లు స్టూడియోస్ ఇక అన్ని సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అనేలా కాంపెయిన్ స్టార్ట్ చేశారు.
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్( Allu Aravind ) బిజినెస్ స్ట్రాటజీ తో సినిమా పరిశ్రమకు అందరికీ అందుబాటులో ఉడేలా ఈ స్టూడియో ఏర్పాటు చేస్తున్నారు.

ఇప్పటికే స్టూడియో పనులు చకచకా నడుస్తున్నాయి.వచ్చే ఏడాది మొదట్లో ఈ స్టూడియో స్టార్ట్ చేయాలని చూస్తున్నారు అల్లు ఫ్యామిలీ.ఈ స్టూడియోలో అల్లు మెగా ఫ్యామిలీ( Mega Family ) హీరోల సినిమాలే కాదు అందరు హీరోల సినిమాలు షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారట.
మంచి అనుభవం కలిగిన టీం ని కూడా తీసుకుని వర్క్ మొదలు పెట్టినట్టు తెలుస్తుంది.ఇప్పటికే అల్లు స్టూడియోలో వర్క్ కోసం కొన్ని అగ్రిమెంట్స్ జరుగుతున్నట్టు తెలుస్తుంది.
మొత్తానికి అల్లు స్టూడియోస్ టాలీవుడ్ లో సరికొత్త సంచలనంగా మారుతుందని చెప్పొచ్చు.







