సెన్సేషన్.. జపాన్ లో 'ఆర్ఆర్ఆర్' 200 రోజుల రన్ పూర్తి!

మన సినిమాలకు పాన్ ఇండియా వ్యాప్తంగా మాత్రమే కాదు.పాన్ వరల్డ్ వైడ్ గా కూడా గిరాకీ పెరిగింది.

 Rrr Completes 200 Days In Japan, Japan, Rrr, Ntr, Rajamouli, Ram Charan,rrr In J-TeluguStop.com

ఈ క్రమంలోనే మన టాలీవుడ్ స్టార్ హీరోలు కలిసి నటించిన మల్టీ స్టారర్ సినిమా ”ఆర్ఆర్ఆర్” ( RRR ).ఈ సినిమాను అగ్ర డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసాడు.ఈ సినిమా గత ఏడాది మర్చి 25న రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ గా సంచలన విజయాన్ని నమోదు చేసింది.

ఇండియన్ సినిమా గర్వించదగ్గ సినిమాగా ఆర్ఆర్ఆర్ చరిత్రకెక్కింది.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్( Ram Charan ), యంగ్ టైగర్ ఎన్టీఆర్ ( Jr Ntr ) హీరోలుగా తెరకెక్కిన భారీ మల్టీ స్టారర్ 1200 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించింది.ఇంతటి భారీ విజయాన్ని నమోదు చేసిన ఈ సినిమాను రాజమౌళి జపాన్ లో కూడా భారీ ప్రమోషన్స్ మధ్య రిలీజ్ చేసారు.

స్వయంగా రాజమౌళి ( S.S.Rajamouli ), రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి వెళ్లి మరీ ప్రమోషన్స్ చేసారు.

అక్కడ కూడా రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్ అందుకుని ఇప్పటికి లాంగ్ రన్ కొనసాగుతూనే ఉంది.

తాజాగా ఈ సినిమా మరో అరుదైన ఘనత సాధించింది.రౌద్రం రణం రుధిరం సినిమా జపాన్ లో 200 రోజుల రన్ కు చేరుకోవడం విశేషం.

ఈ 200 రోజుల రన్ ను ఏకంగా 102 స్క్రీన్ లలో కంప్లీట్ చేసుకుంది.

ఈ క్రమంలోనే మేకర్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసింది.ఇన్ని రోజుల లాంగ్ రన్ అంటే నిజంగానే అరుదైన రికార్డ్ అనే చెప్పాలి.జపాన్ ఆడియెన్స్ ను ఎంతగానో మెప్పించిన ఈ సినిమా విషయంలో చిత్ర యూనిట్ గర్వంగా ఉంది.

ఇదిలా ఉండగా ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా.డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube