తెలంగాణ కాంగ్రెస్ పార్టీ( Congress Party ) నేతల ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యువ సంఘర్షణ సభ సరూర్ నగర్ లో జరిగిన సంగతి తెలిసిందే.ఫస్ట్ టైం తెలంగాణలో బహిరంగ సభలో ప్రియాంక గాంధీ( Priyanka Gandhi ) పాల్గొనడం జరిగింది.
కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తర్వాత నేరుగా అక్కడినుండి ఇక్కడికి వచ్చి.ఆమె పాల్గొనగా ఈ మీటింగ్ కి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులంతా హాజరయ్యారు.
కానీ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి( Komatireddy Venkatreddy ) గైర్హాజరయ్యారు.ఈ క్రమంలో సభకు రాకపోవడంపై కోమటిరెడ్డి స్పందించారు.
వ్యక్తిగత కారణాలతో సభకు హాజరు కాలేదని వివరణ ఇచ్చారు.

ఇదే విషయాన్ని ప్రియాంక గాంధీకి తెలియజేసినట్లు కోమటి రెడ్డి స్పష్టం చేశారు.టీ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ “యువ సంఘర్షణ” సభకు భారీ ఎత్తున నిరుద్యోగులు మరియు విద్యార్థులు హాజరు కావడం జరిగింది.ప్రియాంక గాంధీ ఇచ్చిన స్పీచ్ చాలా హైలెట్ అయింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం పై మండిపడ్డారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పెద్దగా జరిగిందేమీ లేదని… రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం జరిగింది.
ప్రశ్నాపత్రాల లీకేజ్, నిరుద్యోగ భృతి, వాటి విషయాలపై ప్రశ్నల వర్షం కురిపించారు.







