ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటేనే కేవలం బాలీవుడ్ సినిమాలు మాత్రమే అని చెప్పేవారు.అయితే ప్రస్తుతం బాలీవుడ్ ( Bolly Wood )ఇండస్ట్రీలో పరిస్థితులు మారిపోయాయి.
ఈ మధ్యకాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో తెరకేక్కిన ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోతోంది.బాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను మెప్పించడం ఏమో కానీ కనీసం హిందీ ప్రేక్షకులను కూడా మెప్పించలేకపోతున్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇలా బాలీవుడ్ సినిమాలు సక్సెస్ కాకపోవడానికి ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నటుడు రణబీర్ కపూర్( Ranbir Kapoor ) బాలీవుడ్ సినిమాల గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ హాలీవుడ్ కల్చర్ కి అలవాటు పడి హాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలను రీమేక్ చేస్తున్నాము.అందుకే ఇక్కడ సినిమాలు సక్సెస్ కాలేకపోతున్నాయని తెలిపారు.
ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త వారికి అవకాశాలు లేకపోవడం వల్ల ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో తెలియడం లేదు.కొత్తవారికి అవకాశాలు ఇస్తేనే ప్రేక్షకులు మనస్తత్వం ఏంటో తెలిసి సరికొత్త సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారని అప్పుడే సినిమాలు సక్సెస్ అవుతాయని తెలిపారు.

ఒకే ధోరణిలో సినిమాలు చేస్తూ వెళ్ళటం వల్లే బాలీవుడ్ సక్సెస్ కాలేకపోతుందని అసలు ప్రేక్షకులకు ఎలాంటి కంటెంట్ కావాలో తెలియక మేకింగ్ విషయంలో బాలీవుడ్ ఇప్పటికీ అయోమయంలో ఉందని నటుడు రణబీర్ తెలిపారు.ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో వారికి ఎలాంటి సినిమాలు కావాలోఅనే విషయాలను పక్కనపెట్టి కేవలం హాలీవుడ్ సినిమాలపై దృష్టి పెట్టి వాటిని రీమేక్ చేయడం వల్లే బాలీవుడ్ ఇండస్ట్రీ సక్సెస్ కాలేక పోతుంది అంటూ ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇక ఈయన సినిమాల విషయానికి వస్తే సందీప్ రెడ్డి ( Sandeep Reddy ) వంగ దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ ( Animal )అనే సినిమా ద్వారా రణబీర్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఇందులో రష్మిక( Rakshmika ) హీరోయిన్ గా నటించారు.







