సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఎంతోమంది సెలబ్రిటీలు రాజకీయాలలో కూడా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు, ఏపీ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ హెడ్ గా ఉన్నటువంటి జోగి నాయుడు (Jogi Naidu) వైసిపి ప్రభుత్వానికి మద్దతుదారుడుగా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే .
అయితే గత కొంతకాలంగా వైసీపీ ప్రభుత్వానికి ఈయన మద్దతు తెలియజేయడంతో ఏపీ ప్రభుత్వం ఈయనకు ఈ పదవిని అప్పచెప్పారు.అయితే తాజాగా జోగి నాయుడు రాజకీయాల గురించి మాట్లాడుతూ ముఖ్యంగా జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా జోగి నాయుడు మాట్లాడుతూ చిరంజీవి (Chiranjeevi) గారు స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో తాను ఓ కార్యకర్తగా పని చేశానని తెలిపారు.ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించారు.అయితే జనసేన పార్టీ సిద్ధాంతాలు, ఐడియాలజీ నాకు నచ్చలేదు.పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు బాగానే ఉన్నప్పటికీ ఆయన వాటిని ఆచరించకుండా సినిమాటిక్ పనులు చేస్తున్నారని జోగినాయుడు వెల్లడించారు.
ఇక ఈయన ఒక వైపు సినిమాలు చేస్తూనే గాలివాటంగా రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు.

ఇలా గాలి వాటం రాజకీయాలు చేస్తూ తిరిగి మాయమైపోతున్నారని పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో మాత్రమే ప్రొఫెషనల్ అని రాజకీయాలలో కాదని తెలిపారు.జగన్ (Jagan) గారు రాజకీయాల(Politics) లో ప్రొఫెషనల్ ఆయనకి కూడా ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి.కానీ ఆ వ్యాపారాలను జగన్ పూర్తిగా వేరే వారికి అప్పగించి ఈయన రాజకీయాలలోనే కొనసాగుతున్నారని, పూర్తిగా ప్రజలలోనే ఉంటున్నారని జోగినాయుడు తెలిపారు.
కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు.ఈ నాలుగు సంవత్సరాల కాలంలో చాలా సమయం వృధా చేశారు.ఈ సమయంలో ఆయన సినిమాల వైపు కాకుండా ప్రజల్లో కనుక ఉండి ఉంటే తన పరిస్థితి మరోలా ఉండేది అంటూ పవన్ రాజకీయాల గురించి జోగినాయుడు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







