హెడ్ లైన్స్ కోసం విడాకుల విషయం సాగ తీయడం తప్పు: నాగచైతన్య

అక్కినేని నాగచైతన్య( Nagachaitanya ) ప్రస్తుతం కస్టడీ సినిమా( Custody ) ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నటువంటి నాగచైతన్య తన వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తిపరమైన విషయాల గురించి కూడా తెలియజేస్తున్నారు.

 Dragging Up Divorce For Headlines Is Wrong Naga Chaitanya, Naga Chaitanya, Saman-TeluguStop.com

అయితే మొదటిసారి సమంత ( Samantha ) తో విడాకులు తీసుకోవడానికి గల కారణాలను కూడా నాగచైతన్య తెలియజేశారు.సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ కారణంగా ఇద్దరు మధ్య గొడవలు మొదలయ్యాయని ఆ గొడవలు పెరిగి పెద్దవి కావడంతోనే విడాకులు తీసుకొని విడిపోయామంటూ తన విడాకులకు గల కారణాలను తెలియజేశారు.

Telugu Divorce, Naga Chaitanya, Samantha, Tollywood-Movie

ఇలా నాగచైతన్య సమంత విడిపోయినప్పటికీ తరచూ వీరి విడాకుల గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.ఈ క్రమంలోనే నాగచైతన్య విడాకులు( Divorce ) వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.అనంతరం నాగచైతన్య వ్యాఖ్యలపై సమంత పరోక్షంగా స్పందిస్తూ మనమంతా ఒక్కటే కానీ అహంకారం భయం అనేవి మనల్ని దూరం చేస్తాయి.అంటూ ఒక పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

ఇక తాజాగా మరోసారి నాగచైతన్య విడాకుల గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Telugu Divorce, Naga Chaitanya, Samantha, Tollywood-Movie

ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ విడాకులు ప్రకటించి రెండు సంవత్సరాలు అవుతుంది అయినప్పటికీ తమ హెడ్ లైన్స్ కోసం ఇప్పటికీ మావిడాకుల విషయాన్ని సాగదీస్తూనే ఉన్నారని అది పూర్తిగా తప్పు అంటూ ఈ సందర్భంగా మరోసారి విడాకుల గురించి స్పందిస్తూ నాగచైతన్య చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక సినిమాల గురించి ఈయన మాట్లాడుతూ సినిమాలు విడుదలైన తర్వాత ఆ సినిమాకు ఎలాంటి రివ్యూస్ ఇచ్చారు ఎలాంటి కామెంట్స్ చేస్తున్నారు అనే విషయాలను తాను చదువుతానని అయితే కొన్నిసార్లు నేటిజన్స్ చేసినటువంటి కామెంట్స్ కనుక చదివితే ఎందుకు బ్రతికున్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది అంటూ ఈ సందర్భంగా నాగచైతన్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube