ముఖాన్ని మరింత అందంగా చూపించే వాటిలో నవ్వు( Smile ) ఒకటి.నవ్వు ఆకర్షణీయంగా ఉండాలంటే దంతాలు తెల్లగా మెరుస్తూ కనిపించాలి.
కానీ కొందరి దంతాలు గార పట్టి పసుపు రంగులో అసహ్యంగా కనిపిస్తుంటాయి.ఇటువంటి దంతాలను కలిగిన వారు ఇరుగుపొరుగు వారితో మాట్లాడేందుకు సంకోచిస్తుంటారు.
హాయిగా నువ్వేందుకు అసౌకర్యంగా ఫీల్ అవుతారు.ఈ క్రమంలోనే పసుపు దంతాలను వదిలించుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే చింతించకండి.ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీని పాటిస్తే ఎలాంటి పసుపు దంతాలు( Yellow Teeth ) అయినా సరే ముత్యాల్లా మెరుస్తాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా అంగుళం అల్లం ముక్క తీసుకుని పొట్టు తొలగించి నీటిలో శుభ్రంగా కడిగి సన్నగా తురుముకోవాలి.ఈ తురుము నుంచి స్టైనర్ సహాయంతో అల్లం జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు( Turmeric ) వేసుకోవాలి.అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, రెండు టేబుల్ స్పూన్లు అల్లం జ్యూస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
చివరిగా రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె( Coconut Oil ) వేసుకుని మరోసారి అన్నీ కలిసేలా మిక్స్ చేయాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బ్రష్ సహాయంతో దంతాలకు అప్లై చేసి రెండు నిమిషాల పాటు సున్నితంగా తోముకోవాలి.
ఆపై వాటర్ తో దంతాలను, నోటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రోజుకు ఒకసారి ఈ విధంగా చేస్తే గార పట్టి పసుపు రంగులోకి మారిన దంతాలు క్రమంగా తెల్లగా ముత్యాల మాదిరి మారతాయి.
పసుపు దంతాలను తెల్లగా మార్చడానికి ఏ రెమెడీ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.
కాబట్టి పసుపు దంతాలతో తీవ్రంగా మదన పడుతున్న వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.పైగా ఈ రెమెడీని పాటించడం వల్ల చిగుళ్ల వాపు( Gingivities ), చిగుళ్ల నుంచి రక్తస్రావం వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.
దంతాలు, చిగుళ్ళు దృఢంగా మారతాయి.నోట్లో పేరుకుపోయిన బ్యాక్టీరియా నాశనం అవుతుంది.నోరు శుభ్రంగా ఆరోగ్యంగా మారుతుంది.