సోషల్ మీడియాలో( Social Media ) ప్రతి రోజూ వివిధ రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.అయితే అందులో కొన్ని చాలా స్పెషల్ గా కనిపిస్తూ ఉంటాయి.
ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఎక్కువగా జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ కావడం మనం చూస్తూ వున్నాం.అలాంటి వీడియోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంటాయి.
దాంతో అటువంటి వీడియోలు చాలామంది సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు.అందులోనూ మరీ ముఖ్యంగా జంతువులు, పక్షులు మనుషులతో స్నేహం చేసే సందర్భాలు సోసల్ మీడియాలో మరింత వైరల్ కావడం మనం చూసాము.
తాజాగా అలాంటి వీడియో ఒకటి వెలుగు చూసింది.ఇక్కడ ఒక గుడ్లగూబ( Owl ) దాదాపు 98ఏళ్లు పైబడిన బామ్మతో స్నేహం( 98 Years Old Woman ) చేయడం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.ప్రతిరోజూ ఆ పక్షి బామ్మను పరామర్శిస్తుంది.కానీ, ఆ పక్షి ఇంట్లోని మరెవరీతోనూ మాట్లాడకపోవటం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం.ఇక్కడ వీడియోని ఒక్కసారి గమనిస్తే, గుడ్లగూబ ఆ బామ్మ బాల్కనీలో కూర్చోవడం మనం చూడవచ్చు.దాన్ని చూసి తామంతా తమ తాతగారే ఇలా పక్షి రూపంలో వచ్చారని అనుకుంటాం… అంటూ ఓ అమ్మాయి ఇంగ్లీష్‌లో చెప్పిన ఈ మాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బాల్కనీలోకి వచ్చిన గుడ్లగూబ బామ్మను చూడగానే కొన్ని రకాల కదలికలను చేస్తుంది.అది మాట్లాడుతున్నట్లుగా కూడా వీడియోలో కనబడుతోంది.ఆ గుడ్లగూబ ఆమెతో తప్ప మరెవరితోనూ మాట్లాడకపోవడం ఇక్కడ చూడవచ్చు.కానీ, అమ్మమ్మను చూడగానే మాత్రం అది మురిసిపోవటం కనిపిస్తుంది.ఈ అతిథి తన 98 ఏళ్ల అమ్మమ్మను కలవడానికి రోజూ వస్తుందని వీడియో రికార్డ్ చేసిన అమ్మాయి చెబుతుంది.కాగా ఈ అద్భుతమైన వీడియోని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.