కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తుంది.ఈ క్రమంలోనే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కన్నడలో దర్శనిమిచ్చినట్లు తెలుస్తోంది.
బీజేపీ తరపున అసెంబ్లీ ఎన్నికలో ప్రచారం నిర్వహించారని సమాచారం.అయితే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని గతంలో రాజాసింగ్ ను పార్టీ నుంచి బీజేపీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
దీంతో గత ఎనిమిది నెలలుగా రాజాసింగ్ బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేతపై బీజేపీ ఎటువంటి ప్రకటన చేయలేదు.
అయితే హఠాత్తుగా కర్ణాటకలోని సెడం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో రాజాసింగ్ కనిపించడం సర్వత్రా చర్చానీయాంశంగా మారింది.







