ఈ స్టోరీ వింటే మీ గుండె బరువెక్కుతుంది.నిజం, టెడ్డీ బేర్( Teddy bear ) కోసం బతిమిలాడడం ఏమిటి అని అనుకోవద్దు.
తన చిన్నారి ఆడుకునే టెడ్డీని ఒకరోజు అనుకోకుండా గుడ్ విల్ స్టోర్‌కి ఇచ్చేసారు.ఇప్పుడు అదే టెడ్డీ తిరిగి కావాలని ఆ చిన్నారి తండ్రి వారిని మరలా ప్రాధేయపడుతున్నాడు.
అదే టెడ్డీని కావాలని ఎందుకు అడుగుతున్నాడంటే, యుఎస్‌లోని టేనస్సీకి చెందిన టైలర్ కెన్నడీకి భార్యా, 4 ఏళ్ల కూతురు ఉన్నారు.ఆ చిన్నారి ఆడుకునే టెడ్డీ బేర్‌ను అనుకోకుండా ఒకరోజు అక్కడ స్థానికంగా వున్న గుడ్ విల్ స్టోర్ లో ఇచ్చేసారు.
అయితే కొంత కాలానికి టైలర్ కెన్నడీ( Tailer Kennedy ) భార్య అనారోగ్యంతో మరణించింది.తరువాత వారికి ఆ టెడ్డి గుర్తొచ్చింది.దాంతో గుడ్ విల్ స్టోర్‌కి ఇచ్చిన టెడ్డీని తిరిగి ఇవ్వాల్సిందిగా టైలర్ కెన్నడీ ఫేస్ బుక్‌లో అభ్యర్ధించాడు.ఆ టెడ్డీ బేర్‌ను తిరిగి ఇస్తే దాని ఖరీదు కూడా మరలా చెల్లిస్తానంటున్నాడు.అదే టెడ్డీ కావాలని కోరడం వెనుక చాలా బలమైన ఎమోషనల్ కారణం వుంది.ఏంటంటే… టెడ్డీ లోపల రికార్డైన తన భార్య ‘హృదయ స్పందన’ ఉందని టైలర్ అంటున్నాడు.టెడ్డీ పాదాలు నొక్కినపుడు తన భార్య గుండె శబ్దం వినిపిస్తుందని అంటున్నాడు.

దానిని ఆ విధంగా తన అత్తగారు తయారు చేయించారని టైలర్ కెన్నడీ చెప్పుకొచ్చాడు.ఈ పోస్ట్ చూసిన గుడ్ విల్ స్టోర్ నిర్వాహకులు వెంటనే స్పందించడం విశేషం.తరువాత ఆ చిన్నారికి తన తల్లి హృదయ స్పందనను ఇన్ స్టాల్ చేయించి మరీ కొత్త బొమ్మను బహుమతిగా ఇచ్చారు.
పాత టెడ్డీ దొరికే వరకూ ఆ కుటుంబం సంతోషంగా ఉండాలని ఈ పని చేసినట్లు స్టోర్ నిర్వాహకులు చెబుతున్నారు.ఈ క్రమంలో పాత టెడ్డీ స్టోర్ లో ఎక్కడ ఉందో వెతికి ఇస్టామని కూడా స్పష్టం చేశారు.







