లోన్, లాటరీ( Lottery ) అనే పేరు వినగానే అమాయకులు అత్యాశతో సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుతున్నారు.మనిషికి ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు.
కొన్ని సందర్భాల్లో లాటరీ అనే పేరు వినగానే మనసులో అత్యాశ మొదలవడం జరుగుతుంది.దీంతో ముందు వెనక ఆలోచించకుండా లక్షలు పోగొట్టుకుంటున్నారు.
ఈ కోవకు చెందిన ఒక సంఘటన సిద్దిపేటలో జరిగింది.అసలు వివరాలు ఏమిటో చూద్దాం.

సిద్దిపేట కమిషనరేట్ పరిధి( Siddipet )లో ఓ వ్యక్తికి గుర్తు తెలియని వ్యక్తి నుండి ఫోన్ వచ్చింది.తాము మీషో నుంచి మాట్లాడుతున్నామని చెప్పి, రూ.12 లక్షల లాటరీ( 12 Lakhs Lottery ) తగిలిందని నమ్మకం కలిగేలా మాట్లాడాడు.అయితే రూ.12 లక్షల లాటరీ సొమ్ము పొందాలంటే ముందుగా ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ కట్టాలని చెప్పాడు.దీంతో బాధితుడు తనకు రూ.12 లక్షలు లాటరీ తగిలింది అనే అత్యాశతో ముందు వెనక ఆలోచించకుండా సైబర్ నేరగాడు పంపించిన ఫోన్ నెంబర్ కు ఫోన్ పే ద్వారా రూ.1,78,750 బదిలీ చేశాడు.డబ్బులు బదిలీ అయిన కాసేపటికి ఫోన్ స్విచాఫ్ రావడంతో తాను మోసపోయిన విషయం గ్రహించి హెల్ప్ లైన్ నెంబర్1930 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు.
అదే ప్రాంతంలో మరో బాధితుడికి లోన్ మంజూరు అయిందని, ప్రాసెసింగ్ చార్జ్, జీఎస్టీ కట్టాలంటూ ఒక లింక్ పంపించాడు సైబర్ నేరగాడు.ఆ లింక్ ఓపెన్ చేసిన బాధితుడు ఫోన్ పే ద్వారా రూ.18,499 పంపించాడు.తర్వాత కాసేపటికి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో చేసేదేమీ లేక తాను కూడా పోలీసులను ఆశ్రయించవలసి వచ్చింది.

ఇటువంటి మోసాలపై స్పందించిన సైబర్ పోలీసులు.( Cyber Police ) ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనవసరంగా లోన్, లాటరీ లాంటి వాటితో అత్యాశకు పోయి డబ్బులు పోగొట్టుకోకూడదని.లోన్ అప్లై చేయకుండా లోన్ ఎలా మంజూరు అవుతుందో.? అసలు లాటరీ టికెట్( Lottery Ticket ) కొనకుండానే లాటరీ ఎలా తగులుతుందో.? అమాయక ప్రజలు కాస్త ఆలోచించాల్సిన అవసరం ఉందని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.







