కొన్నిసార్లు మనం ఉదయం నిద్ర లేవగానే మన శరీరం ఎటువంటి కారణం లేకుండా నొప్పిని అనుభవించడం మొదలవుతుంది.అంతేకాకుండా ఒక్కొక్కసారి రోజంతా అలసిపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది.
ఈ సమస్యకు అతిపెద్ద కారణం శరీరంలో పోషకలు లేకపోవడమే అటువంటి పరిస్థితులలో ఈ సమస్య నుంచి బయటపడడానికి మీరు పోషకమైన ఆహారాల గురించి తెలుసుకోవాలి.దిని లోపం కారణంగా రక్తపోటు( Blood Pressure ) పెరిగిపోతుంది అలాగే వ్యాధులతో పోరాడే మీ సామర్థ్యం బలహీనపడటం మొదలవుతుంది.
ఈ లోపం వల్ల మధుమేహం( Diabetes ), అధిక రక్తపోటు కూడా వస్తాయి.విటమిన్ డి లోపం వల్ల డిప్రెషన్ సమస్య పెరుగుతుంది.ఎముకల్లో నొప్పి, కీళ్ల నొప్పులు మొదలవుతాయి.బలహీనత పెరుగుతుంది.ఇలాంటి కారణాల వల్ల ఒక వ్యక్తి ఉదయం నిద్ర లేచిన తర్వాత అలసిపోయినట్లు కనిపిస్తాడు.శరీరా కణజాలాలను తయారు చేయడానికి ప్రోటీన్( Protein ) అవసరం ఎంతో ఉంటుంది.
పాలు, సోయాబీన్స్, చికెన్,తృణ దాన్యాలు, పాలు మరియు మాంసంలో ప్రోటీన్ లభిస్తుంది.ఉదయం నిద్ర లేచిన వెంటనే అలసటను దూరం చేయడానికి కచ్చితంగా ఈ నియమాలను పాటించాలి.
ముఖ్యంగా చెప్పాలంటే తక్కువ నూనె మరియు సుగంధ ద్రవ్యాలతో ఆహారాన్ని సిద్ధం చేయాలి.పచ్చి కూరగాయలను కాల్చడం లేదా అతిగా ఉడికించడం మానుకోండి.బ్రేక్ ఫాస్ట్ లో ఎప్పుడూ బ్రెడ్, బటర్, పరోటాలు తినకండి.కూరగాయలు, పెరుగు, మొలకెత్తిన గింజలు మొదలైన వాటిని కూడా తీసుకోవాలి.ఇది శరీరానికి సరిపడా పోషణను అందిస్తుంది.అలాగే కూరగాయలు ఉడకబెట్టిన తర్వాత ఆ నీటిని కూడా వాడండి.
మరిగే సమయంలో నీటిలోని ఐదు నుంచి 55 శాతం పోషకాహారం నీటిలో కలిసిపోతుంది.ఇంకా చెప్పాలంటే మీకు అల్పాహారం తినడానికి సమయం లేకపోతే కచ్చితంగా తక్కువ మొత్తంలో వాల్నట్స్( Walnuts ), బాదం మరియు జీడిపప్పు తినాలి.
అలాగే తాజా పండ్లు మరియు కూరగాయలను తినడం కూడా మంచిదే.