సినిమా ఇడస్ట్రీలో ఎంతో సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబంలో దగ్గుబాటి( Daggubati ) కుటుంబం ఒకటే.ఈ కుటుంబం నుంచి వెంకటేష్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అయ్యారు.
అనంతరం రానా ( Rana) లీడర్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.అయితే రానా కేవలం హీరో పాత్రలలో మాత్రమే కాకుండా విలన్ గా ప్రాధాన్యత ఉన్నటువంటి సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఇలా హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న రానా కెరియర్ విషయం పక్కన పెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన 2020 ఆగస్టు నెలలో తాను ప్రేమించిన అమ్మాయి మీహికా బజాజ్ ( Miheeka Bajaj )అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు.
ఇలా వివాహం తర్వాత ఈ దంపతులు ఎంతో సంతోషంగా ఉన్నప్పటికీ వీరి వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వీరిద్దరు విడాకులు( Divorce ) తీసుకొని విడిపోతున్నారు అంటూ కూడా వార్తలు వినిపించాయి.అయితే ఈ వార్తలను ఎప్పటికప్పుడు మీహికా కొట్టి పారేస్తున్నారు.ఇకపోతే పెళ్లయిన మూడు సంవత్సరాల అవుతున్న ఈ దంపతులకు ఇంకా పిల్లలు లేకపోవడంతో పిల్లల విషయంలో ఈ జంట గురించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
పిల్లల విషయంలో రానా దంపతులు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం దగ్గుబాటి కుటుంబ సభ్యులను ఒక్కసారిగా షాక్ కి గురిచేసిందని చెప్పాలి.
రానా దంపతుల పిల్లల గురించి ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారట వీరిద్దరూ పిల్లలని కనకుండా అనాధ పిల్లలను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది.ఇలా పిల్లలను దత్తత తీసుకోవాలని ఈ దంపతులు నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులందరూ షాక్ అయ్యారని తెలుస్తుంది.
అయితే రానా మిహికా బజాజ్ తీసుకున్న ఈ నిర్ణయం ఎంత వరకు వాస్తవం అన్నది ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు.కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.మరి ఇందులో ఎంతవరకు నిజముందనేది తెలియాలి అంటే ఈ వార్తలపై రానా స్పందించాల్సి ఉంది.