అవును, మీరు విన్నది అక్షరాలా నిజం.యూపీలోని చందౌలీ జిల్లాలో వ్యవసాయ కార్మికుడు సలావుద్దీన్ కుమారుడు అయినటువంటి 17 ఏళ్ల మహ్మద్ ఇర్ఫాన్( Mohammed Irfan ) ఉత్తరప్రదేశ్ మాధ్యమిక సంస్కృత శిక్షా పరిషత్ బోర్డు ఉత్తర మాధ్యమ-II (12వ తరగతి) పరీక్షల్లో 82.71శాతం మార్కులు ఏకంగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.ఇతర సబ్జెక్టులతో పాటు సంస్కృతం, సాహిత్యం అనేవి 2 తప్పనిసరి సబ్జెక్టులు.
సంస్కృత ఉపాధ్యాయుడు కావాలని కలలు కంటున్న ఇర్ఫాన్ 10వ, 12వ తరగతుల పరీక్షలలో మొదటి 20 ర్యాంకుల్లో నిలిచిన ఏకైక ముస్లిం యువకుడిగా రికార్డు సృష్టించాడు.
ఈ సందర్భంగా ఇర్ఫాన్‌ను సంపూర్ణానంద సంస్కృత ప్రభుత్వ పాఠశాలలో( Sumpurmanananda Sanskrit Govt.
School ) చేర్చిన క్షణాలను గర్వంగా గుర్తుచేసుకున్నారు తన తండ్రి.ఎందుకంటే అతను ఫీజు భరించగలిగే ఏకైక పాఠశాల అక్కడ అదే.అతగాడు ఓ వ్యవసాయ కూలీ.రోజుకు రూ.300తో వారి ఇల్లు గడుస్తుంది.అందుకే ఇర్ఫాన్‌ను ప్రైవేట్ లేదా మరే ఇతర పాఠశాలకు పంపే స్థోమత వారికి లేదు.దాంతో యేడాదికి రూ.400-500 మాత్రమే ఫీజు ఉన్న సంపూర్ణానంద సంస్కృత పాఠశాలలో అతగాడిని చేర్చారు.

అయితేనేం, పాఠశాలలో చేరిన మొదటి రోజు నుంచే మనోడు సంస్కృత భాషపై ఆసక్తిని పెంచుకున్నాడని స్కూల్ యాజమాన్యం చెబుతోంది.అతడి అంకితభావం, కృషి వల్లనే ఇది సాధ్యం అయ్యిందని అంటున్నారు.దీనివల్లే 12వ తరగతి పరీక్షలకు హాజరైన 13,738 మంది విద్యార్థులను అతగాడు ఓడించగలిగాడు అని గర్వంగా అన్నారు.ఈ సందర్భంగా తన తండ్రి మాట్లాడుతూ… ఇర్ఫాన్ తన కలను సాకారం చేసుకోకుండా కుటుంబం అడ్డుకోదని చెప్పాడు.
ఇక ఇర్ఫాన్ మాట్లాడుతూ.తరువాత శాస్త్రి (బీఏతో సమానం), ఆచార్య (ఎంఏతో సమానం) పూర్తి చేసి, సంస్కృత అధ్యాపకుడిగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాను అని చెప్పుకొచ్చాడు.







