Bindhu Madhavi : త్రిష బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ చేశాను.. బిగ్ బాస్ బిందు మాధవి షాకింగ్ కామెంట్స్?

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్, బిగ్ బాస్ విన్నర్ బిందు మాధ‌వి( Bindu Madhavi ) గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.కాగా మొదట హీరోయిన్ గా ప్రేక్షకులకు పరిచయం అయిన బిందు మాధవి కొన్ని సినిమాలలో నటించి ఆ తర్వాత ఇండస్ట్రీకీ దూరం అయ్యింది.

 Bindu Madhavi About Dating Trisha Ex Boyfriend-TeluguStop.com

చాలాకాలం తర్వాత బిగ్ బాస్ షో ద్వారా మళ్లీ ప్రేక్షకులను పలకరించింది.బిగ్ బాస్ నాన్‌ స్టాప్ విన్న‌ర్‌గా నిలిచి, తెలుగు బిగ్ బాస్( Bigg Boss ) చరిత్రలోనే మొదటి లేడి విన్నర్ గా నిలిచింది బిందు మాధ‌వి.

ఇకపోతే బిందు మొదట కమల్ కామరాజు హీరోగా నటించిన అవకాయ్ బిర్యానీ సినిమాతో హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చింది.

Telugu Aha Ott, Bigg Boss, Bindhu Madhavi, Newsense, Trisha, Varun Manian-Movie

ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకుంది.తరువాత బంపర్ ఆఫర్, ఓం శాంతి,రామ రామ కృష్ణ కృష్ణ, ప్రతి రోజు, పిల్ల జమిందార్ వంటి సినిమాల్లో నటించి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.ఆమె నటించిన సినిమాలు అన్నీ కూడా ఆమెకు సరైన సక్సెస్ ని తెచ్చిపెట్టలేకపోయాయి.

ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత సినిమాల పరంగా ఈమె సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించడంతో ఈమెకు వరుసగా అవకాశాలు వచ్చి చేరుతున్నాయి.ఇది ఇలా ఉంటే బిందు మాధవి తాజాగా నటించిన వెబ్ సిరీస్ న్యూసెన్స్.( Newsense Webseries )

Telugu Aha Ott, Bigg Boss, Bindhu Madhavi, Newsense, Trisha, Varun Manian-Movie

ఈ వెబ్ సిరీస్ మే 12 నుంచి ఆహా లో స్ట్రీమింగ్ కానుంది.ఈ వెబ్ సిరీస్ మరికొద్ది రోజుల్లోనే స్ట్రీమింగ్ కానుంది.ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ ని మొదలుపెట్టేశారు.ఈ నేపథ్యంలోని తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ని లాంచ్ చేశారు.ఈ సందర్భంగా మూవీ మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ ప్రెస్ మీట్ లో భాగంగా బిందు మాధవికి ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురయింది.

ఆమె త్రిష బాయ్‌ ఫ్రెండ్‌( Trisha Boyfriend )తో డేటింగ్ చేస్తున్నారా అని ప్రశ్నించగా.అందులో కొంత నిజం, కొంత అబద్ధం ఉందని చెప్పింది.

Telugu Aha Ott, Bigg Boss, Bindhu Madhavi, Newsense, Trisha, Varun Manian-Movie

త్రిష బాయ్‌ఫ్రెండ్‌ను ప్రేమించిన మాట నిజమే కానీ ఒకేసారి తామిద్దరం ప్రేమించలేదని బిందు మాధవి స్పష్టం చేసింది.త్రిష అతడికి ఎక్స్ అయ్యాకే తాము ప్రేమలో పడ్డామని చెప్పుకొచ్చింది బిందు మాధవి.బిందు మాధవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా( Social Media )లో వైరల్ గా మారాయి.ఎట్టకేలకు తాజాగా ఈ ముద్దుగుమ్మ తన లవ్ విషయం గురించి బయట పెట్టింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube