హైదరాబాద్ లో కల్తీ రాయుళ్లు రెచ్చిపోతున్నారు.ఈ క్రమంలో కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్టును తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టైంది.
నగరంలోని కాటేదాన్ లో ఎస్ఓటీ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో కల్తీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.ఈ దాడులలో భాగంగా కుళ్లిపోయిన అల్లం, వెల్లుల్లితో ముఠా సభ్యులు పేస్టు తయారు చేస్తున్నట్లు గుర్తించారు.
ఈ క్రమంలోనే కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టుతో పాటు కూల్ డ్రింక్ ను సీజ్ చేసిన పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు.







