రైల్వేట్రాక్‌పై ఇన్‌స్టా రీల్స్ తీసుకోవాలని బాలుడు ప్రయత్నం.. రైలు ఢీకొని స్పాట్ డెడ్..

సోషల్ మీడియాలో హీరో కావాలనే తపనతో యువకులు మూర్ఖత్వపు పనులు చేస్తూ అర్ధాంతరంగా ప్రాణాలు విడుస్తున్నారు.ఇలాంటి ఘటనలు పదేపదే పునరావృతం అవుతున్నా తమకు ఏం కాదులే అనే ధీమాతో కొందరు పిచ్చి పనులు చేస్తున్నారు.

 Boy Tries To Take Insta Reels On Railway Track Hit By Train And Dies On The Spo-TeluguStop.com

తాజాగా మరో బాలుడు కూడా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ పిచ్చిలో పడి తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు.హైదరాబాద్‌లో శుక్రవారం సాయంత్రం ఈ దుర్ఘటన వెలుగు చూసింది.

ఈ ఘటనలో 16 ఏళ్ల బాలుడు రీల్స్ వీడియోను రైల్వే ట్రాక్‌పై షూట్ చేస్తుండగా లోకల్ ట్రైన్ ఢీకొట్టింది.దాంతో బాలుడు మరణించాడు.

గవర్నమెంట్ రైల్వే పోలీసులు ( Government Railway Police )మృతుడిని మహమ్మద్ సర్ఫరాజ్‌గా( Mohammad Sarfaraz ) గుర్తించారు.సర్ఫరాజ్‌ రీల్స్ వీడియో చేస్తున్నప్పుడు తనకు, ట్రాక్‌కు మధ్య ఉన్న దూరాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోయాడని, అతను వేగంగా వెళుతున్న రైలుకు అడ్డంగా వెళ్లాడని, ఇది వీడియోలో కూడా కనిపించిందని పోలీసులు తెలిపారు.

భరత్‌నగర్ రైల్వే స్టేషన్ ( Bharatnagar Railway Station )సమీపంలో మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.సర్ఫరాజ్ 9వ తరగతి విద్యార్థి కాగా ఇతనికి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేసే అలవాటుంది.అయితే శుక్రవారం స్నేహితులతో కలిసి బయటికి వెళ్లాడు.రైల్వే ట్రాక్ వద్దకు వచ్చిన తర్వాత రిలీస్ చేయాలనే కోరిక అతనిలో పుట్టింది.దాంతో అతడు స్నేహితులకు ఫోన్ ఇచ్చి రీల్స్‌ వీడియోకి ఫోజులు ఇవ్వడం ప్రారంభించాడు.

అదే సమయంలో ట్రాక్ పైన శరవేగంగా లోకల్ ట్రైన్ దూసుకొచ్చింది.అది తనను ఢీకొడుతుందనే విషయాన్ని సర్ఫరాజ్ గుర్తించలేకపోయాడు.

స్నేహితులు కూడా అతని అప్రమత్తం చేయలేదు.దాంతో కన్నుమూసి తెరిచేలోగా రైలు అతడి తలను వేగంగా ఢీ కొట్టింది.

దాంతో ఈ బాలుడు కొన్ని మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాడు.దెబ్బ బాగా తగలడంతో అక్కడికక్కడే కన్నుమూశాడు.

ఈ ఘటనతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.బంగారం లాంటి తమ కొడుకు చనిపోయాడనే చేదు వార్తను వారు జీర్ణించుకోలేకపోతున్నారు.

సంఘటనకు సంబంధించిన వీడియోని, సర్ఫరాజ్ స్నేహితుల వాంగ్మూలాలను పరిగణలోకి తీసుకొని పోలీసులు ఈ మృతిని ధ్రువీకరించారు.MMTS రైళ్లు( MMTS trains ) ఇతర రైళ్ల కంటే వెడల్పుగా ఉంటాయని, అది తెలియని బాలుడు ప్రమాదాన్ని ఊహించి ఉండకపోవచ్చని ఒక అధికారి తెలిపారు.తండ్రి మహ్మద్ సాదిక్ ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube