ఖమ్మం కలెక్టరేట్ ఎదుట హై టెన్షన్ వాతావరణం నెలకొంది.మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరులు కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.
పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ క్రమంలో పొంగులేటి అనుచరులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది.
దీంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.నిరసన నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.







