టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న పేరు, గుర్తింపు గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది కెరీర్ పరంగా సక్సెస్ అయినా నిహారిక ( Niharika ) మాత్రం ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదని చాలామంది భావిస్తారు.
నిహారిక కెరీర్ పరంగా సక్సెస్ సాధిస్తే ఆమె అభిమానులు సైతం ఎంతగానో సంతోషిస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
నిహారిక నటిగా, నిర్మాతగా మళ్లీ కెరీర్ పరంగా బిజీ అవుతుండగా పుష్ప2 సినిమాలో( Pushpa 2 ) ఆమెకు ఛాన్స్ దక్కిందని తెలుస్తోంది.
పుష్పరాజ్ కు షాకిచ్చే రోల్ లో ఆమె కనిపిస్తారని తెలుస్తోంది.అయితే పుష్ప మేకర్స్ నుంచి కానీ, నిహారిక నుంచి కానీ ఇందుకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.పుష్ప2 సినిమాలో నిహరిక నటిస్తే ఆ సినిమాకు నిహారిక కచ్చితంగా ప్లస్ అవుతారే తప్ప మైనస్ అయితే కారని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

పుష్ప2 సినిమాలో మూడు నుంచి నాలుగు కొత్త పాత్రలు కనిపిస్తాయని ఆ పాత్రలు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని సమాచారం అందుతోంది.పుష్పలో ఆమె ఫైట్ సీన్లు కూడా చేస్తారని నిహారిక లుక్ భిన్నంగా ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.పోలీస్ ఇన్ఫార్మర్ గా ఆమె పాత్ర ఉంటుందని ఆ పాత్రకు సంబంధించిన ట్విస్ట్ మైండ్ బ్లోయింగ్ గా ఉండనుందని తెలుస్తోంది.

పుష్ప2 సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని సమాచారం అందుతోంది.బన్నీ( Allu Arjun ) వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారని సమాచారం అందుతోంది.పుష్ప2 సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.నిహారిక కెరీర్ పరంగా బిజీ కావడంతో పాటు మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.








