రమ, వల్లి( M.M.Srivalli ) ఇద్దరు తోబుట్టువులు అనే విషయం మన అందరికి తెలిసిందే.వారు ఈ రోజు సినిమా ఇండస్ట్రీ ఇంత స్థాయిలో ఉండటానికి ముఖ్యమైన కారకులుగా కూడా చెప్పుకోవచ్చు.
తెలుగు సినిమా అంటే ఏంటో ప్రపంచానికి పరిచయం చేసిన రాజమౌళి కి వల్లి మరియు రమ ఇద్దరు రెండు కళ్ళు.వల్లి సినిమా ప్రొడక్షన్ ని హ్యాండిల్ చేసే విధానం ఏ రేంజ్ లో ఉంటుందో జూనియర్ ఎన్టీఆర్ మరియు ప్రభాస్ వంటి హీరోలు చెప్తుంటే వినడానికి రెండు చెవులు సరిపోవు.
ఇక రమ( Rama Rajamouli ) కూడా అంతే రాజమౌళి కంటే ఆమె ఎన్నో విషయాల్లో స్ట్రాంగ్.ఆ విషయం రాజమౌళి( Rajamouli ) చాల ఇంటర్వూస్ లో చెప్పాడు.

అయితే ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఇంత స్ట్రాంగ్ గా సినిమా ను ముందుకు నడిపించడం మరియు ప్రతి విషయంలోనూ క్లారిటీ, ఎలాంటి విషయాన్నీ అయినా వారు హ్యాండిల్ చేసే విధానం అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి.ఇంత స్ట్రాంగ్ గా ఇద్దరు లేడీస్ ఉండటానికి ముఖ్య కారణం వీరి తల్లి అనే విషయం చాల మందికి తెలియదు.

రమ కి ఏడేళ్లు, వల్లి కి తొమ్మిది ఏళ్ళ వయసు ఉన్నప్పుడు వారి తండ్రి కన్ను మూసారు.వారి తాతగారు భర్త చనిపోయి ఇద్దరు కూతుళ్లతో ఎందుకు కష్టాలు నా ఇన్నిటికి తీసుకెళ్తాను అన్నా కూడా ఎవరి పంచన ఉండకూడదు, తన కూతుళ్లను తానే పెంచి పెద్ద చేసి ఒక అయ్య చేతిలో పెడతాను అని నిర్ణయించుకొని మొదట పచ్చళ్ళ వ్యాపారం చేసింది.ఆ తర్వాత స్కూల్ కి హాస్టల్ ఒకటి నడిపించేవారు.కొన్నాళ్లకే ఒక కాలేజ్ లో మెస్ కూడా నడిపించారు.

ఇలా ఇన్ని పనులు చేస్తూ పిల్లలకు ఎలాంటి కష్టం లేకుండా చూసుకుంటూ, వారి ఆలనా పాలన చూసుకుంది రమ, వల్లి ల తల్లి.బ్రతకడం కోసం ఎవరి మీద ఆధారపడకుండా ఉన్నదాంట్లోనే ఎదో ఒక పని చేస్తూ డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా ఎంతో దైర్యం గా పిల్లలను పెంచింది.వారి తల్లికి ఉన్న ఆత్మవిశ్వాసమే రమ మరియు వల్లి లకు కూడా వచ్చింది అని చెప్తుంటారు.మా అమ్మ మా జీవితంలో పెద్ద ఉదాహరణ అని, ఆమె వల్లే మేము ఎన్నో నేర్చుకొని ఈ రోజు ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నాం అంటున్నారు .







