తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ సాధించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) క్రేజ్ ఎలాంటిదో మనకు తెలిసిందే.ఇలా చిరంజీవి ఇండస్ట్రీలో ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ అంచలంచలుగా ఎదుగుతూ ఈ స్థాయికి చేరుకున్నారు.
ఇక చిరంజీవికి కారులంటే చాలా ఇష్టం మార్కెట్లోకి కొత్త టెక్నాలజీతో ఏవైనా కార్లు వచ్చాయి అంటే తప్పకుండా ఆ కారు తన గ్యారేజీలో ఉండాల్సిందే.అయితే చిరంజీవికి కార్లు అంటే ఇంత ఇష్టం ఉండడానికి కారణం ఒక హీరోయిన్ చేసిన అవమానమే కారణమని తెలుస్తుంది.

చిరంజీవి ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న సమయంలో నటి మాధవి( Madhavi )తో కలిసి ఖైదీ సినిమాలో నటించారు.అయితే ఈ సినిమా అవుట్ డోర్ షూటింగ్ సమయంలో ఒకరోజు చిరంజీవి గారి కోసం కారు రాలేదట అయితే చిరంజీవికి కారు రాకపోవడంతో అదే హోటల్లో హీరోయిన్ కూడా ఉండటంతో ఇద్దరికీ కలిపి ఒకే కారు పంపించారు.అప్పటికే కారు కోసం ఎదురుచూస్తున్న చిరంజీవి గారు కారు రావడంతోనే మాధవితో కలిసి వెనుక సీట్లు కూర్చున్నారట.అయితే అప్పటికే మాధవి స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలో కొనసాగుతూ భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

ఇలా చిరంజీవి వెనక్కి వెళ్లే ఆమె సీట్లో కూర్చోవడంతో ఆమె చిరంజీవితో మాట్లాడుతూ ఇది నా కోసమే ఏర్పాటు చేసిన కారు మీరు వెళ్లి ముందు కూర్చోండి ఇలా నా పక్కన కూర్చోవడానికి వీలు లేదు అని చెప్పడంతో చిరంజీవి తనకు సారీ చెప్పిన ముందుకు వెళ్లి కూర్చున్నారట.అలా ఆరోజు ఆ హీరోయిన్ చేసిన అవమానమే చిరంజీవికి కారు అంటే ఇష్టం వచ్చేలా చేసిందని అందుకే ఎలాంటి కొత్త కారు మార్కెట్లోకి వచ్చిన వెంటనే ఆ కారు తన గ్యారేజ్ లో ఉండాలని చిరంజీవి కొత్త కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారని తెలుస్తోంది.







