మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు.ఇందులో భాగంగా దివిటిపల్లి వద్ద అమరరాజా లిథియం బ్యాటరీ కంపెనీకి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
తరువాత మంత్రి శ్రీనివాస్ గౌడ్, గల్లా అరుణ, గల్లా జయదేవ్ తో కలిసి ఆయన భూమి పూజ చేశారు.అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడనున్నారు.