Sadha : ఎంత ప్రయత్నించినా కన్నీళ్ళాగడం లేదు… ఎమోషనల్ అయిన సదా!

జయం సినిమా( Jayam Movie ) ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి సదా( Sadha ).మొదటి సినిమాతోనే ఎంతో అద్భుతమైన ఆదరణ సంపాదించుకున్నటువంటి ఈమె అనంతరం తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ బిజీ అయ్యారు.

 No Matter How Hard You Try You Dont Cry Always Emotional-TeluguStop.com

అయితే ప్రస్తుతం సదా సినిమాలకు దూరమైనప్పటికీ బుల్లితెర కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇలా బుల్లితెరపై ప్రసారమయ్యే డ్యాన్స్ షోలకు ఈమె జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

ఇలా బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

Telugu Sadha, Tollywood-Movie

ఇలా సదా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకోవడంతో అసలు ఏం జరిగింది అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.అయితే సదా ఎందుకు ఇలా కన్నీళ్లు పెట్టుకుంటున్నారనే విషయానికి వస్తే… సదా 2019 ఏప్రిల్ 23వ తేదీ ముంబైలో ఎర్త్ లింగ్స్( Earth Lings ) అనే రెస్టారెంట్ ప్రారంభించారు.అయితే ఈ రెస్టారెంట్ ప్రారంభించిన కొంత సమయానికే కరోనా రావడం లాక్ డౌన్ పడినప్పటికీ ఈమె ఆ రెస్టారెంట్ పెట్టిన స్థలానికి కరెక్ట్ గా అదే చెల్లించేవారు అయితే ఉన్నఫలంగా ఓనర్ రెస్టారెంట్ ఖాళీ చేయమని చెప్పడంతో ఒక్కసారిగా సదా ఎమోషనల్ అయ్యారు.

Telugu Sadha, Tollywood-Movie

ఇదే విషయాన్ని ఈమె తెలియజేస్తూ 2019వ సంవత్సరంలో స్థానం రెస్టారెంట్ ప్రారంభించానని అయితే అప్పుడు ఈ ప్రాంతమంతా చాలా దయనీయ స్థితిలో ఉండేది.కరోనా సమయంలో కస్టమర్లు రాకపోయినా తాను ఎక్కువ సమయం ఇక్కడే గడుపుతూ తన రెస్టారెంట్ ను చాలా అందంగా తీర్చిదిద్దుకున్నాను.ప్రతి నెల రెంట్ కూడా కరెక్ట్ గా చెల్లించేదాన్ని ఇప్పుడు తన రెస్టారెంట్ చాలా బాగా నడుస్తోంది.అయితే ఉన్నఫలంగా ఓనర్ రెస్టారెంట్ కాలి చేయమని చెప్పడం తనకు పెద్ద షాకింగ్ న్యూస్ అనిపిస్తోందని సదా వెల్లడించారు.

ఇది నా ఫస్ట్ బిజినెస్ కావడంతో ఈ రెస్టారెంట్ మూసేసి వెళ్లాలి అంటే తనకు బాధగా ఉందని కన్నీళ్లు కూడా ఆగడం లేదు అంటూ ఎమోషనల్ అయ్యారు.ఈ రెస్టారెంట్ ను వదిలి వెళ్ళలేక పోతున్నాను అంటూ ఈ సందర్భంగా సదా ఎమోషనల్ అవుతూ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube