రియలిస్టిక్ యాక్షన్ మూవీగా కస్టడీ.. వర్కౌట్ అయ్యేనా?

అక్కినేని యంగ్ హీరోల్లో ఒకరైన నాగ చైతన్య ( Naga Chaitanya ) వరుస హిట్స్ అందుకుని తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు.అయితే గత సినిమా థాంక్యూ తో ప్లాప్ అందుకుని డీలా పడ్డప్పటికీ ఇప్పుడు చేసే సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టాడు.

 Venkat Prabhu's Film With Naga Chaitanya Titled Custody, Custody, Venkat Prabhu,-TeluguStop.com

అంతేకాదు తన పంథా మార్చి కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.ప్రజెంట్ నాగ చైతన్య చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘కస్టడీ’ ( Custody ).

నాగ చైతన్య కెరీర్ లో 22వ సినిమాగా తెరకెక్కుతున్న సినిమా ”కస్టడీ”.ఇది తమిళ్, తెలుగు ద్విభాషా భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతుంది.తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ( Venkat Prabhu ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ చైతన్య కు జోడీగా కృతి శెట్టి ( Krithi Shetty) హీరోయిన్ గా నటిస్తున్నారు.ఈ సినిమాకు నిర్మాతలు కూడా భారీగానే బడ్జెట్ పెడుతున్నారు.

ఈ సినిమాలో నాగ చైతన్య ఫుల్ లెన్త్ పోలీస్ రోల్ లో నటిస్తున్నాడు.ఇక ఇటీవలే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయగా బాగా ఆకట్టుకుంది.కాగా ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారు.మే 5న ట్రైలర్ విడుదల చేయబోతున్నారు.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించింది.ఇందులో డైరెక్టర్ వెంకట్ ప్రభు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు.

ఈ సినిమా కోసం నాగ చైతన్య, కృతి శెట్టి తో పాటు టీమ్ మొత్తం ఎంతో కష్టపడ్డాం అని ముఖ్యంగా ఈ సినిమా రియలిస్టిక్ యాక్షన్ తో సాగుతుందని.ప్రతీ పాత్ర నటన ఇంకా సీన్స్ కూడా రియలిస్టిక్ ఫీల్ ను అందిస్తాయని తెలిపారు.తొలిసారి తెలుగు సినిమాతో రాబోతున్న నన్ను ఆడియెన్స్ ఆదరిస్తారని కోరుకుంటున్నాను” అని ఈయన ,ముగించాడు.

ఇక ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తుండగా ఇళయరాజా, యువన్ శంకర్ రాజాలు సంగీతం అందిస్తున్నారు.

అలాగే ఈ సినిమా మే 12న సమ్మర్ కానుకగా రిలీజ్ కానుంది.మరి చైతూ ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube