ప్రస్తుత రోజుల్లో చాలామంది గుర్తింపు సంపాదించడం కోసం సోషల్ మీడియాలో రకరకాల విన్యాసాలతో వీడియోలు చేస్తూ ఉన్నారు.ఈ రకంగా వీడియోల ద్వారా వైరల్ అయ్యి… గుర్తింపు సంపాదించుకొని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి.
డబ్బులు సంపాదిస్తున్నారు.ప్రజెంట్ ఇటువంటి ట్రెండ్ గట్టిగా నడుస్తోంది.
ఎవరికి వారు తమ టాలెంట్ చూపించడానికి యూట్యూబ్ నీ ఉపయోగించుకుని చానల్ ఓపెన్ చేసి… చెలరేగిపోతున్నారు.ఈ రకంగానే ఉత్తరాఖండ్( Uttarakhand ) డెహ్రాడూన్ కి చెందిన అగస్త్య చౌహన్( AGASTYA CHAUHAN ) “ప్రో రైడర్ 1000” అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు.

ఈ ఛానల్ లో ఎప్పటికప్పుడు తన బైక్ రేస్ వీడియోలు అప్ లోడ్ చేస్తూ తన సబ్స్క్రైబర్స్ ని అలరిస్తూ ఉంటారు.అంతేకాదు వెరైటీ బైకులతో అతివేగంతో బండి నడుపుతూ…అగస్త్య ఫాలోవర్స్ ని ఆకట్టుకుంటూ ఉంటాడు.ఈ రకంగానే ప్రయత్నించాలని ఢిల్లీలో జరిగే టూ విల్లర్ లాంగ్ రైడ్ పోటీల్లో పాల్గొనేందుకు బైక్ పై వెళుతూ… 300 కిలోమీటర్ల వేగంతో బైక్ నడపగా అదుపుతప్పి డివైడర్ ని ఢీ కొట్టి అక్కడికక్కడే చనిపోయాడు.ఉత్తరప్రదేశ్ ( Uttar Pradesh )రాష్ట్రం అలీగడ్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది.
యూట్యూబ్( YouTube ) వీడియో కోసం అతి వేగంతో అగస్త్య చౌహన్… మరణించడంతో అతని ఛానల్ ఫాలోవర్స్ ఈ వార్త తెలుసుకొని దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.







