బుల్లితెర గ్లామరస్ యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ ( Anasuya ) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఒకప్పుడు బుల్లితెరపై ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వెండితెరపై వరుస సినిమాలలో నటిస్తున్నారు.
తాజాగా రంగమార్తాండ సినిమాలో నటించిన ఈమె ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప2 సినిమా ( Pushpa 2Movie )షూటింగ్లో బిజీగా ఉన్నారు.
వీటితోపాటు మరి కొన్ని సినిమాలలో కూడా అనసూయ నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఇకపోతే తాజాగా ఈమె నటించిన విమానం సినిమా( Vimanam Movie ) నుంచి కూడా తాజాగా టీజర్ విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అనసూయ ఇండస్ట్రీలో హీరోల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల పట్ల చాలా వ్యత్యాసాలు ఉన్నాయని ఈమె తెలియజేశారు.
కేవలం హీరోలను దృష్టిలో పెట్టుకుని సినిమాలను చేస్తున్నారని అనసూయ వెల్లడించారు.అయితే హీరోయిన్స్ మాత్రం వారితో రొమాన్స్ చేయడానికి మాత్రమే సినిమాలలో నటిస్తున్నారని అలాగే సహాయం కావాలని గట్టిగా అరిస్తే హీరోలు వచ్చి కాపాడతారని అనసూయ తెలియచేశారు.
ఇలా హీరోలు నొక్కితే నొక్కించుకోవాలి గిల్లితే గిల్లించుకోవాలి తప్ప హీరోయిన్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు అంటూ ఈ సందర్భంగా అనసూయ హీరో హీరోయిన్లకు ఇండస్ట్రీలో ఇచ్చే ప్రాధాన్యత గురించి మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈ మధ్యకాలంలో పలువురు సెలబ్రిటీలు కూడా హీరోయిన్లకు ప్రాధాన్యత ఉండే పాత్రలు ఇవ్వాలి అంటూ దర్శక నిర్మాతలకు విజ్ఞప్తి చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే అనసూయ కూడా ఇలా హీరోయిన్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేదంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.