ప్రముఖ నటి ఖుష్బూ( Khushboo ) రామబాణం సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేని గోపీచంద్ రామబాణం సినిమా తాను కోరుకున్న సక్సెస్ ను అందిస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
అయితే ఖుష్బూ తన తొలి సినిమా హీరో అయిన వెంకటేశ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి.విక్టరీ వెంకటేశ్( Victory Venkatesh ) అంటే మాకు చాలా సెంటిమెంట్ అని ఆమె అన్నారు.
విక్టరీ వెంకటేశ్ మా తొలి హీరో అని తను నా మొదటి స్నేహితుడని ఆమె చెప్పుకొచ్చారు.తాను, వెంకటేశ్ ప్రతిరోజూ మాట్లాడుకోమని ఖుష్బూ కామెంట్లు చేశారు.
కానీ నాకే సమస్య వచ్చినా వెంకటేశ్ నాతో ఉంటాడని ఖుష్బూ చెప్పుకొచ్చారు.సెంటిమెంటల్ అనే వర్డ్ లో వెంకటేశ్ సెంటి అయితే నేను మెంటల్ అని మేము అంత క్లోజ్ అని ఖుష్బూ వెల్లడించారు.

32 మంది హీరోహీరోయిన్లకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉందని 80ల నాటి హీరో హీరోయిన్లు అంతా ఆ గ్రూప్ లో ఉన్నారని ఖుష్బూ పేర్కొన్నారు.ఆ గ్రూప్ లో తిన్న వంటకాల గురించి, చేసిన పనుల గురించి చెప్పుకుంటామని ఆమె చెప్పుకొచ్చారు.ఆ గ్రూప్ లో వెంకటేశ్ కూడా ఉన్నా అస్సలు రెస్పాండ్ కాదని వెంకటేశ్ అలా బిహేవ్ చేస్తాడని ఖుష్బూ చెప్పుకొచ్చారు.ఖుష్బూ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వారసుడు( Varasudu ) సినిమాలో ఖుష్బూ కీలక పాత్రలో నటించినా ఈ సినిమాలో ఆమె పాత్రకు సంబంధించిన సన్నివేశాలను కట్ చేశారనే సంగతి తెలిసిందే.కెరీర్ విషయంలో ఖుష్బూ ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
సెలెక్టివ్ గా ఆమె రోల్స్ ను ఎంచుకుంటున్నారు.ఈ మధ్య కాలంలో తెలుగులో ఖుష్బూకు ఆఫర్లు పెరుగుతున్నాయి.








