ఎటూ తేల్చని 'పొంగులేటి ' ! అందరిలోనూ టెన్షన్ 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలక నేతగా.ఉన్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ( Ponguleti Srinivasa Reddy )రాజకీయ ప్రస్థానంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

 Ponguleti Srinivasa Reddy Political Strategy In Telangana , Ponguleti Srinivas-TeluguStop.com

బీఆర్ఎస్( BRS party ) లో చోటు చేసుకున్న పరిణామాలపై ఆ పార్టీకి దూరంగా ఉంటూ, బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ పైన, విమర్శలు చేసిన శ్రీనివాస్ రెడ్డిని ఆ పార్టీ బహిష్కరించింది.కాంగ్రెస్, బీజేపీ లలో ఏదో ఒక పార్టీలో పొంగులేటి చేరబోతున్నారనే హడావుడి జరుగుతుంది.

అంతేకాకుండా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సొంతంగా పార్టీ స్థాపిస్తున్నారనే ప్రచారమూ జరిగింది.ఆర్థికంగా సామాజికపరంగా బలమైన నేతగా ఉన్న పొంగులేటిని తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో( Khammam ) గట్టిగా ప్రభావం చూపించవచ్చని కాంగ్రెస్ బిజెపిలో భావిస్తున్నాయి.

అందుకే పొంగులేటి పెట్టిన షరతులు అన్నిటికీ అంగీకారం తెలుపుతూ,  తమ పార్టీలో చేరాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నాయి.అయితే పొంగులేటి మాత్రం ఇంకా తన నిర్ణయం ఏమిటి అనేది క్లారిటీ ఇవ్వలేదు.

Telugu Brs, Khammam, Khammam Mp, Seenanna, Telangana Bjp, Telangana-Politics

బిజెపి( BJP ) అగ్ర నేతల నుంచి రాష్ట్రస్థాయి నేతలు వరకు అందరూ పొంగులేటిని చేర్చుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తుందని, కీలకమైన పదవులు కట్టబెడతామని,  అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి సూచించిన వారికి టిక్కెట్లు ఇస్తామనే హామీలు కూడా ఇస్తుండగా , కాంగ్రెస్ సైతం అంతే స్థాయిలో హామీలను ఇస్తూ పొంగులేటిని చేర్చుకునే ప్రయత్నం చేస్తుంది.అయినా ఆయన మరికొంత కాలం వేచి చూసే ధోరణి ని అవలంబించాలని నిర్ణయించుకున్న పొంగులేటి ప్రస్తుతం తెలంగాణలో చోటుచేసుకుంటున్న పరిణామాలు అన్నిటిని నిశితంగా గమనిస్తున్నారు.

Telugu Brs, Khammam, Khammam Mp, Seenanna, Telangana Bjp, Telangana-Politics

మరోవైపు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో,  ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటించాలని ఒత్తిడి ఆయనపై పెరుగుతోంది.ఇది ఇలా ఉంటే పొంగులేటి కాంగ్రెస్ లో చేరతారా బిజెపిలోకి వెళ్తారా అనే విషయంపై జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి.అసలు ఆయన ఏ పార్టీలోకి వెళ్తారు అనేది ఆయనకు అత్యంత సన్నిహితంగా మెలిగే నాయకులకు కూడా అర్థం కావడం లేదు.

Telugu Brs, Khammam, Khammam Mp, Seenanna, Telangana Bjp, Telangana-Politics

 అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బిజెపికి అంతగా పట్టులేదని,  కాంగ్రెస్( Congress party ) ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ లో చేరితే మంచిదనే ఒత్తిడి పొంగులేటి అనుచరుల నుంచి వస్తోంది.అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభావం అంతంత మాత్రమే అన్నట్టుగా ఉండడం , తెలంగాణలోనూ గ్రూపు రాజకీయాలు ఎక్కువగా ఉండడంతో,  పొంగులేటి ఆలోచనలు పడ్డారట.అందుకే మరి కొద్ది రోజులు పాటు వేచి చూసే ధోరణిని అవలంబించాలని పొంగులేటి నిర్ణయించుకున్నారట.కానీ ఆయన ఏ పార్టీలో చేరుతారనే విషయంలోనే తెలంగాణ రాజకీయ వర్గాల్లో టెన్షన్ పెరిగిపోతుంది.

ఇక పొంగులేటి అభిమానులు సైతం ఈ విషయంలో ఒత్తిడికి గురవుతున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube