అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.కరీంనగర్ రూరల్ మండలంలో పంట నష్టాన్ని పరిశీలించిన ఆయన మాట్లాడారు.
రైతులు అధైర్య పడొద్దన్న మంత్రి గంగుల ఆందోళన వద్దని పేర్కొన్నారు.పంట కోయకముందే నష్టపోయిన రైతులను కూడా ఆదుకుంటామని చెప్పారు.
ఇంతటి పంట నష్టం ఎప్పుడూ జరగలేదన్నారు.అకాల వర్షాలకు గతంలో 10 నుంచి 30 శాతం వరకే నష్టం జరిగిందని పేర్కొన్నారు.
కానీ ఈసారి 100కు వందశాతం పంటనష్టం వాటిల్లిందని తెలిపారు.పంట నష్టం జరిగిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు ఇస్తున్నామని వెల్లడించారు.







