పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) లైనప్ లో వరుసగా భారీ ప్రాజెక్టులు ఉన్న విషయం తెలిసిందే.హరిహర వీరమల్లు ( Hari Hara Veera Mallu ), ఉస్తాద్ భగత్ సింగ్ ( Ustaad Bhagat Singh ) తో పాటు వినోదయ సీతం రీమేక్ లో కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు.
ఇప్పటికే ఈయన వినోదయ సీతం రీమేక్ షూట్ ను పూర్తి చేసాడు.ఇక భగత్ సింగ్ అయితే ఈ మధ్యనే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి అయ్యింది.
అలాగే వీరమల్లు దాదాపు 70 శాతం పూర్తి అయినట్టు సమాచారం.

వీటితో పాటు పవన్ కళ్యాణ్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ లలో ”ఓజి” ( OG Movie ) ఒకటి.ఈ సినిమా కూడా షూట్ స్టార్ట్ అయ్యింది.లాంచ్ అయిన వెంటనే ఓజి సినిమాను ముంబైలో స్టార్ట్ చేసారు.
ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ తో పాటు కీలక షెడ్యూల్ పై యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించినట్టు సమాచారం.యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను ముంబైలో స్టార్ట్ చేసి శరవేగంగా పూర్తి కూడా చేసినట్టు వార్తలు వచ్చాయి.మరి దీనిపై మేకర్స్ ఈ రోజు సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో మునుపెన్నడూ లేని విధంగా పవన్ ను ప్రజెంట్ చేస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ సైతం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.ఈ క్రమంలోనే మేకర్స్ పవర్ స్టార్ సాలిడ్ మాస్ అండ్ స్టైలిష్ పిక్ ను షేర్ చేసారు.

ఈ పిక్ షేర్ చేస్తూ ముంబై షెడ్యూల్ ముగిసినట్టు తెలిపారు.అంతేకాదు పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పవన్ రేజ్ అంటే ఏంటో చూడబోతున్నారు అంటూ హామీ ఇచ్చారు.ఈ ప్రామిస్ తో ఫ్యాన్స్ మరింత హుషారుగా ఉన్నారు.ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే థమన్ ( Thaman ) సంగీతం అందిస్తుండగా.డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.







