టాలీవుడ్ హీరో పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.గత ఏడాది విడుదల అయిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఎన్టీఆర్ ఈ సినిమాతోనే పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ఎన్టీఆర్ 30.( NTR 30 ) ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.కోట్ల బడ్జెట్ తో నిర్మించనున్న ఈ సినిమాని భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా సినిమాగా విడుదల చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలవ్వగా ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఇందులో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్( Janhvi Kapoor ) హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.
అంతేకాకుండా ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కి సంబంధించిన మరొక వార్త కూడా చక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే.దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి( SS Rajamouli ) దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించబోతున్న సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు.పూర్తి అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో తారక్ కూడా ఒక కేమియో పాత్రలో నటించబోతున్నారు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా చిత్ర బృందం ఈ విషయంపై స్పందించింది.
ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తారక్ ఈ ప్రెస్టీజియస్ సినిమాలో నటించడం లేదు అంటూ తాజాగా చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది.దీంతో ఎన్టీఆర్ విషయంలో వస్తున్న ఆ క్రేజీ న్యూస్ కి పులిస్టాప్ పెట్టినట్టు అయింది.
ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పొందుతున్న సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా అనంతరం రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో నటించనున్నారు.







